Homeఅంతర్జాతీయంకరోనాకు వ్యాక్సిన్​ కష్టమే.. రానుంది కష్టకాలమే...

కరోనాకు వ్యాక్సిన్​ కష్టమే.. రానుంది కష్టకాలమే…

ప్రభుత్వాలు చెబుతున్నట్లు వ్యాక్సిన్​ త్వరలోనే వస్తుంది, ఇక ప్రజల కష్టాలు తీరతాయని దైర్యం  చెబుతున్నాయి. కానీ పలు పరిశోదనలు ఈ ఆశలను ఆవిరి చేసే భయంకర విషయాలను చెబుతున్నాయి. అయితే దీనికి కారణాలు కూడా చాలా మంది శాస్త్రవెత్తలు వివరిస్తున్నారు. సాదారణంగా ఏదైనా వైరస్​ మనిషికి సోకినపుడు వాటిని తట్టుకునే రోగనిరోధక శక్తి మనలో తయారవుతుంది. దీంతో మరల ఆ వైరస్​ మనకు సోకినపుడు మనలో అప్పటికే తయారైన యాంటీ బాడీస్​ వైరస్​ను ఎదుర్కుని వైరస్​నుంచి మనల్ని కాపాడుతాయి. కానీ ప్రస్తుతం మనల్ని వనికిస్తున్న కరోనా వైరస్​ ఇందుకు భిన్నంగా ఉంది. ఈ వైరస్​ ఎప్పటికప్పుడు తన రూపురేఖలను మార్చుకుంటుంది. దీంతో యాంటీ బాడీస్​ ఈ వైరస్​ను గుర్తించలేకపోతున్నాయి. దీంతో పాటు ఈ వైరస్​ జన్యుక్రమం అనేక రకాలుగా ఉండడంతో ఒక తిరిగి యాంటీ బాడీలు వాటిపై పని చేయలేకపోతున్నాయి.

వ్యాక్సిన్​ పనిచేయదా…

కరోనాకు ప్రస్తుతం ఇతర దేశాల్లో తయారవుతున్న వ్యాక్సిన్​లు పనిచేయవనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇతర దేశాలలో ఉన్న కరోనాకు, మన దేశంలో ఉన్న వైరస్​కు చాలా తేడా ఉంది. దీంతో పాటు త్వరగా దీనిలో ఉన్న రూపు మార్చుకునే లక్షణంతో దానిపై వ్యాక్సిన్​ పని చేస్తుందనకోవడం అవివేకమే అంటున్నారు శాస్త్రవెత్తలు. అలాగే ఇతర దేశాల్లో ఉన్న కరోనా, మన దేశంలో ఉన్న కరోనా దాదాపు పూర్తి వేరే వైరస్​గా భావించవచ్చు. అలాంటప్పుడు ఈ వ్యాక్సిన్లు వేసుకోవడం క్యాన్సర్​ వ్యాధికి ఏయిడ్స్​ మందులు వాడినట్లే ఉంటుంది. అంటే సంబందం లేని మందులు వాడినట్లు మాత్రమే.

మళ్ళీ రాదా…

కరోనా వైరస్​ మళ్ళీ రాదు అనుకోవడం మూర్ఖత్వమే. దీనికి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. అన్ని చోట్లా మళ్ళి కరోనా సోకిన సందర్బాలు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాయి. దీంతో పాటు ఒకసారి వచ్చిన వైరస్​, ఇంకోసారి వచ్చిన వైరస్​ వేరు అయి ఉండవచ్చు. అంతే కాకుండా మళ్ళీ వైరస్​ వచ్చినపుడు దాని ప్రభావం మరింత ఎక్కువ ఉంటున్నట్లు కూడా తెలుపుతున్నారు వైద్యులు.

రోగనిరోధక శక్తి భావన కూడా తప్పే…

మారథాన్​ అలవోకగా పూర్తి చేసిన క్రీడాకారులు కూడా ప్రస్తుతం కరోనా బారినపడి వెంటిలేటర్​పై ఉంటూ మరణిస్తున్నారు. అలాంటి వారి డైట్​, ఫిట్​నెస్​ చాలా బలంగా ఉంటుంది. కానీ అలాంటి వారు కూడా మరణిస్తున్నారు. అంతే కాకుండా రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే పండు ముసలి వారు కూడా కరోనా నుంచి కోలుకుంటున్న సందర్బాలు కూడా ఉన్నాయి.

దీన్ని బట్టి చూస్తే ఇప్పటికిప్పుడు ఏవేవో తినేసి విటమిన్లు వాడేసినంత మాత్రాన రోగనిరోధక శక్తి ఉన్నఫలంగా వచ్చేయదు అని తెలుస్తుంది. ఈ భయాన్ని అడ్డు పెట్టుకుని ప్రపంచ వ్యాప్తంగా ఆహార, మెడికల్​ మాఫియా జనాలను పిచ్చోళ్ళను చేస్తుందనడం వాస్తవం. దీంతో పాటు త్వరలో రానున్న శీతాకాలంలో వైరస్​ తీవ్రంగా విజృంభించనున్నట్లు శాస్త్రవెత్తలు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం తగ్గడానికి మన దగ్గర ఉన్న ఆయుదం కేవలం జాగ్రత్తలు పాటించడమే అని ప్రజలు తెలుసుకుంటే ఏ వ్యాక్సిన్​ అవసరం లేకుండానే ఈ ప్రపంచానికి కరోనా మహమ్మారి దూరమవుతుంది.

                              ‌‌‌‌‌‌– ఇదే నిజం….

Recent

- Advertisment -spot_img