Homeతెలంగాణతెలంగాణలో 1967 కరోనా కేసులు

తెలంగాణలో 1967 కరోనా కేసులు

తెలంగాణాలో కరోనా రోజు రోజుకు విస్తరిస్తుంది. తాజాగా తెలంగాణాలో 1967 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 09 మంది రోగులు కరోనా కారణంగా మృతి చెందారు.. కొత్తగా రోకవరీ అయి డిశ్చార్జ్ అయిన వారు 2058. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న యాక్టివ్ కేసులు 30234. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 185833 కి చేరింది. మొత్తం మరణాలు 1100 గా ఉన్నాయి.

ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా నుంచి రికవరీ అయిన వారి సంఖ్య 154499. రికవరీ రేటు 83.13 శాతం ఉంది. నిన్న ఒక్క రోజులో చేసిన టెస్టులు 50108, మొత్తం టెస్టులు 2850869. కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో అత్యదికంగా జీహెచ్ఎమ్సీ పరిధిలో 297 కేసులు నమోదయ్యాయి. ఇతర జిల్లాల్లోనూ కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img