Homeఆంధ్రప్రదేశ్#AndhraPradesh : 24 గంటల్లో 71 మంది మృతి

#AndhraPradesh : 24 గంటల్లో 71 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో కరోనా బారినపడి 71 మంది మరణించినట్లు ఆంధ్రప్రదేశ్ హెల్త్ సెక్రటరీ అనిల్ సింఘాల్ తెలిపారు.

అత్యధికంగా నెల్లూరులో 9 మంది మరణించారు. కృష్ణా జిల్లాలో 8, అనంతపురం, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో ఏడుగురు చొప్పున మరణించారు.

పశ్చిమగోదావరి, చిత్తూరు జిల్లాల్లో ఆరుగురు చొప్పున, విశాఖలో 5, గుంటూరులో నలుగురు, ప్రకాశంలో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, కడప జిల్లాలో ఇద్దరు మరణించారు.

గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 74,681 మందికి టెస్ట్‌లు చేయగా వారిలో 14,669 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణైంది.

ఒకటిరెండు రోజుల్లో ట్రూనాట్ టెస్టులు చేపడతామని.. కోవిడ్ చికిత్స కోసం 422 ఆస్పత్రులకు అనుమతి ఇచ్చామని సింఘాల్ తెలిపారు.

రాష్ట్రంలో అందుబాటులో ఉన్న 5,572 ఐసీయూ బెడ్లలో ప్రస్తుతం 2,570 బెడ్లు ఖాళీగా ఉన్నాయన్నారు.

ఆక్సిజన్ బెడ్లు 7,744 అందుబాటులో ఉన్నాయన్నారు. 7643 జనరల్ బెడ్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.

బెడ్‌ల లభ్యతకు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో 28,994 రెపిడెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని.. గత 3 రోజుల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు 13,864 రెపిడెసివిర్ ఇంజక్షన్లు అందించామని చెప్పారు.

Recent

- Advertisment -spot_img