HomeజాతీయంVaccine for Teenagers : 15-18 ఏళ్ల లోపు వారికి నేటి నుంచి టీకా

Vaccine for Teenagers : 15-18 ఏళ్ల లోపు వారికి నేటి నుంచి టీకా

Vaccine for Teenagers : 15-18 ఏళ్ల లోపు వారికి నేటి నుంచి టీకా

Vaccine for Teenagers : నేటి నుంచి దేశవ్యాప్తంగా 15-18 ఏళ్లలోపు మధ్యనున్న టీనేజర్లకు కరోనా టీకాలు పంపిణీ చేయనున్నారు.

ఇప్పటి వరకు పెద్దలకు ఇస్తున్నట్టుగానే వీరికి కూడా 0.5 మిల్లీ లీటర్ల మోతాదులో టీకా వేస్తారు.

తొలి డోసు తీసుకున్న నాలుగు వారాల తర్వాత అంటే 28 రోజులకు రెండో డోసు వేస్తారు.

టీకాల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేసినట్టు తెలంగాణ ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ (డీహెచ్) డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.

ఈ మేరకు నిన్న మార్గదర్శకాలు విడుదల చేశారు.

Corona Third Wave : భారత్​లో కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ గ్యారెంటీ

Banking Rules : మారిన బ్యాంకుల రూల్స్​.. కొన్ని భారం.. మరికొన్ని మంచి..

ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ టీకాలు అందుబాటులో ఉంటాయని చెప్పినప్పటికీ ధర విషయాన్ని వెల్లడించలేదు.

Vaccine for Teenagers

గ్రేటర్ హైదరాబాద్ పరిధి, 12 మునిసిపల్ కార్పొరేషన్లలో ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకున్న లబ్ధిదారులకు మాత్రమే టీకాలు ఇవ్వనుండగా, జిల్లాల్లో మాత్రం నేరుగా టీకా కేంద్రానికి వచ్చి టీకా వేయించుకోవచ్చని అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో మొత్తం 22,78,683 మంది టీనేజర్లు ఉంటారని అంచనా వేస్తున్నారు.

వైద్యుడి పర్యవేక్షణలోనే టీకా వేయనుండగా, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అరగంటపాటు అక్కడే ఉండాలి.

ఈ క్రమంలో ఏమైనా దుష్ప్రభావాలు తలెత్తితే కనుక వెంటనే చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

కాగా, ఈ నెల 10 నుంచి వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 ఏళ్లు నిండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి మూడో డోసు ఇవ్వనున్నారు.

Jobs Recruitment : కొత్త రోస్టర్‌ విదానంలోనే ఉద్యోగాల భర్తీ

KFC Chicken : కేఎఫ్‌సీ చికెన్‌ బాక్స్‌ను తిందామని తెరిచిచూస్తే షాక్‌..

Recent

- Advertisment -spot_img