Homeఅంతర్జాతీయంకరోనా వ్యాక్సిన్​ రూ.225 మాత్రమే

కరోనా వ్యాక్సిన్​ రూ.225 మాత్రమే

అందించనున్న పుణేకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్‌

ప్రపంచానికి భారత్​ సంజీవనిగా మారనుంది. కరోనాతో కకావికళం అవుతున్న ప్రపంచానికి తక్కువ ధరకే వ్యాక్సిన్​ను అందించనున్నట్లు భారత్​కు చెందిన సీరం ఇనిస్టిట్యూట్​ ప్రకటించింది. కేవలం రూ.225 రూపాయలకే కోవిడ్​19 వ్యాక్సిన్​ను ప్రజలకు అందించేందుకు తాము సిద్దంగా ఉన్నామని సంస్థ ప్రకటించింది. ఇందుకు గవి (ది వ్యాక్సిన్ అలయన్స్), బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌ ఆర్థిక సహకారాన్ని అందించనుంది. ఇందుకు సంబందించిన కీలక ఒప్పందం పూర్తి అయింది. దీంతో భారత్​తో సహా దాదాపు 100 దేశాలకు ప్రయోజనం చేకూరనుంది. పుణేకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఇండియాకు గేట్స్ ఫౌండేషన్ 150 మిలియన్ డాలర్ల నిధులు ఇవ్వనుంది. దీంతో భారత్‌లో కోట్లాది మందికి తక్కువ ధరకే వ్యాక్సిన్​ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం దేశ అవసరాలకు సరిపడేలా దాదాపు 10 కోట్ల డోస్​లను తయారు చేసే దిశగా ప్రయత్నిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. 2021 నాటికి ప్రపంచ దేశాలకు అతి తక్కువ ధరకే వ్యాక్సిన్​ అందించనున్నట్లు సంస్థ ప్రతినిధులు ప్రకటించారు.

Recent

- Advertisment -spot_img