Homeఅంతర్జాతీయంరష్యా టీకాపై అనుమానాలెన్నో...

రష్యా టీకాపై అనుమానాలెన్నో…

రష్యా ప్రపంచంలోనే తోలి టికా అని మార్కెట్లోకి విడుదల చేస్తున్న స్పుత్నిక్​ వీ మీద అనేక అనుమానాలు వ్యక్తపరుస్తూనే ఉన్నారు శాస్త్రవెత్తలు. రష్యాలో ఈ టీకా వాడకాన్ని పక్కన పెడితే తాము ఈ టీకాను వాడాలా వద్దా, కొనుగోలు చేయాలా వద్దా అనే సందేహంలో అనేక దేశాలు తర్జనభర్జన పడుతున్నాయి. దీంతో పాటు దీనిపై ఇంకా నిపుణుల విమర్శలు ఆగడంలేదు. మూడవ దశ క్లినికల్​ ట్రయల్స్​ వివరాలు రష్యా బయటకు చెప్పకుండా ఈ టీకాను నమ్మేదెలా అని ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు రష్యా కూడా ఈ టీకా కేవలం 18 నుంచి 60 ఏండ్ల లోపు వారికి మాత్రమే ఈ టీకాను సిఫార్సు చేస్తుంది. మిగిలిన వయస్కుల్లో దీని ప్రభావంపై మరింత పరిశీలిస్తున్నట్లు తెలిపింది రష్యా. దీంతో దీనిని ఇంకా పూర్తిగా నిర్ధారణ చేసుకోకముందే విడుదల చేశారంటూ అసలు ఇది మొదటి టీకాగా పరిగణలోకి రాదని, దీనికంటే చాలా టీకాలు ముందున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Recent

- Advertisment -spot_img