HomeSocial Mediaజాగ్రత్త..! మళ్లీ కరోనా..

జాగ్రత్త..! మళ్లీ కరోనా..

ప్రస్తుతం ప్రపంచంలో పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే చైనా ఆరోగ్య అధికారుల ప్రకారం.. దేశంలో కరోనా ఇన్ఫెక్షన్ మరింత పెరిగే అవకాశం ఉంది. దాని కేసులు పెరిగే అవకాశం ఉంది. ఆసుపత్రులు, క్లినిక్‌లలో జ్వరపీడితుల సంఖ్యలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయని జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రతినిధి సమాచారం ఇచ్చారు. వీరిలో ఎక్కువగా శ్వాసకోశ వ్యాధులు కనిపిస్తున్నాయి. ఇన్‌ఫ్లుఎంజా కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు.

చైనాలో చలికాలంలో ఇన్‌ఫ్లుఎంజా వైరస్ రోగులు పెరుగుతారని.. దీని కారణంగా జనవరిలో కరోనా మహమ్మారి మళ్లీ పెరగవచ్చని భావిస్తున్నారు. ఇందులో JN.1 వేరియంట్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. చైనాలోని దక్షిణ ప్రావిన్సులలో, అక్టోబర్ నెలలో ఇన్ఫ్లుఎంజా కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురయ్యారు. దీని తర్వాత, ఇన్‌ఫ్లుఎంజా బి వైరస్ ఇక్కడ వ్యాప్తి చెందడం ప్రారంభించింది. కొన్ని ప్రావిన్సులలో ఇన్ఫ్లుఎంజా B వైరస్ నిష్పత్తి ఇన్ఫ్లుఎంజా A కంటే చాలా ఎక్కువగా ఉంది.

మందస్తుగా.. భారతీయులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. చలికాలంలో చాలా మందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుందని, దీని వల్ల పదే పదే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. వృద్ధులు, గర్భిణులు, చిన్నారుల్లో ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాపిస్తుందనే భయం నెలకొంది. వారికి టీకాలు వేయడానికి ఏర్పాట్లు చేయాలని చెబుతున్నారు.

Recent

- Advertisment -spot_img