Homeఅంతర్జాతీయంజీవితాంతం కరోనా ప్రభావం...?

జీవితాంతం కరోనా ప్రభావం…?

కరోనా బారిన పడి రికవరీ అయిన వారిని మరో పెద్ద సమస్య వెంటాడుతుంది. కరోనా ఫలితాలు కొంత మంది జీవితాంతం అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన చెందుతున్నారు పలువురు పరిశోదకులు. ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్న ఈ దశలో కరోనా బాదితులు వ్యాది నుంచి రికవరీ అయినప్పటికీ రుచి, వాసనను కోల్పోతున్నట్లు పలు పరిశోదనలు వెల్లడిస్తున్నాయి. సాధారణంగా కరోనా రోగ లక్షణాలలో రుచి, వాసన కోల్పోవడం సాదారణంగా ఉంటుంది. రికవరీ అయిన తరువాత చాలా మందికి ఈ ఇంద్రియాలు కొన్ని వారాల్లోనే సాధారణ స్థితికి వస్తాయి. కానీ కొందరిలో మాత్రం గతంలో తెలిసిన వాసనలు, రుచులలో గణనీయమైన మార్పులను గమనించారు దీంతో జీవితాంతం వారికి ఈ సమస్య వెంటాడుతుందన్న భయం మొదటైంది.
రుచి, వాసన కోల్పోవడం తరచుగా వైరల్ ఇన్ఫెక్షన్, జలుబు వంటి కారణాలతో కూడా జరుగుతుంది. కానీ కోవిడ్​ రోగిలో మాత్రం ఈ లక్షణాలను ప్రభావితం చేసే విధానం భిన్నంగా అనిపిస్తుందని హార్వర్డ్ న్యూరో సైంటిస్ట్ డాక్టర్ సందీప్ రాబర్ట్ దత్తా తెలిపారు. అనోస్మియాపై ఇటీవల జరిపిన అధ్యయనంలో ఆయన బాగస్వామిగా ఉన్నారు
“చాలా సందర్భాల్లో జలుబు వచ్చినప్పుడు వాసనను కోల్పోవటానికి కారణం శ్లేష్మం కూర్పు మారుతుంది, ముక్కు సూపర్ స్టఫ్ అవుతుంది” అని ఆయన చెప్పారు. “జలుబు తగ్గినప్పుడు ఆ మంట పోతుంది, మళ్ళీ వాసన పసిగట్టవచ్చు. కానీ కోవిడ్​ రోగుల్లో ఇది తేడాగా ఉంది.
జూలై ప్రారంభంలో ఓ పరిశోధనలో 55 మంది కరోనావైరస్ రోగులు రుచి, వాసన బలహీనతను అనుభవించారు. వీరిలో చాలా మంది పూర్తిగా కోలుకున్నారని లేదా నాలుగు వారాల తరువాత మెరుగుపడ్డారని చెప్పారు. కానీ అదే సమయంలో 11% మంది లక్షణాలు మెరుగుపడలేదని, అధ్వాన్నంగా ఉందని నివేదించారు.
దత్తా ప్రకారం కరోనా కారణంగా రుచి లేదా వాసన కోల్పోయే చాలా మంది చాలా త్వరగా తిరిగి పొందుతారు. రెండు నుండి ఆరు వారాల్లో తిరిగి వాసన, రుచిని గుర్తించే అవకాశం ఉందని అంచనా వేశాడు.
ఈ రోగులలో దత్తా మాట్లాడుతూ తిరిగి వచ్చినప్పుడు వారి వాసన యొక్క స్థాయిలో చాలా మార్పు ఉన్నట్లు, ఈ పరిస్థితి పరోస్మియా అని పిలువబడుతుంది అని తెలిపారు. ఉదాహరణకు మీకు ఇష్టమైన షాంపూ కరోనాకు ముందు మీకు తెలిసినంత వాసన ఇప్పుడు ఉండకపోవచ్చు.

Recent

- Advertisment -spot_img