Homeహైదరాబాద్latest Newsటౌన్ ప్లానింగ్ లో అవినీతి జలగ

టౌన్ ప్లానింగ్ లో అవినీతి జలగ

ఇదేనిజం, శేరిలింగంపల్లి: పేరుకే ప్రణాళికా విభాగం కానీ వారు చేసేవన్నీ అసంబద్దమైన ప్రణాళికలే  అని తేటతెల్లం చేస్తూ అవిభాగానికే మచ్చ తెస్తున్నారు. వారే చందా నగర్ సర్కిల్ 21 ప్రణాళికా విభాగం అధికారులు. అడ్డగోలుగా  అధికారులు జారీ చేస్తున్న అనుమతులతో  సమస్యలు మరింత తీవ్రం అవుతున్నాయి తప్పించే వారు ఒరగబెట్టిందేం లేదు. ప్రధానంగా అవినీతి  అందనంత రేంజ్ లో పెరిగిపోయిందని ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

ఓ ఉన్నతాధికారి అవినీతి మితిమీరడంతో వేరే సర్కిల్ నుంచి ఇక్కడకు ట్రాన్స్ఫర్ చేశారు.కానీ ఆఅవినీతిఅధికారి ఆగడాలు  మాత్రం  ఆగడంలేదు.  ఆ అధికారికి  ముడుపులు ముడితే చాలు రోడ్డు కబ్జా చేసినా, చెరువులో షెడ్డు వేసినా, నాలాను ఆక్రమించినా, ఏకంగా జీహెచ్ఎంసీ  పార్కు కబ్జా చేసినా చెల్లుతుంది . ఒకవేళ లేదంటే మాత్రం  కిరాయి సైన్యం పంపించి మరీ బెదిరించి వసూలు చేస్తున్నట్లు రుజువులు ఉన్నాయి. ఇటీవల మాదాపూర్ పోలిస్ స్టేషన్లో  ఓ ఎస్సై ఏసీబి అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే ఇందులో సదరు టౌన్ ప్లానింగ్ అధికారీ డబ్బులు ఇవ్వాలని  బెదరించినట్లు ఆ వ్యక్తి పోలిసులకు పిర్యాదు చేయడం గమనార్హం. ఇంతలా ఆ అధికారి వారి సైన్యం రెచ్చిపోతున్నా విజిలెన్స్  అధికారులు ఓ కన్నేయక పోవడం విశేషం.

వివాదాస్పద భూముల్లో నిర్మాణ అనుమతులకు ఆ అధికారే కేంద్ర బిందువు.
మియాపూర్లో 100, 101 సర్వే నంబర్లలో  సాంకేతిక పరమైన కారణాలతో అక్కడ ఎలాంటి నిర్మాణాలకు అనుమతి లేదు. కానీ  అలాంటి భూముల్లో సైతం అనుమతులు ఇచ్చి లక్షల్లో ముడుపులు తీసుకొని గురువు తగ్గ శిష్యుడు అనిపించుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.మాదాపూర్ అయ్యప్ప సొసైటి, గోకుల్ ప్లాట్స్ లో వందల సంఖ్యలో నిర్మాణాలు జరుగుతున్నాయి . ఒక్కోఅదనపు అంతస్తుకు లక్షల్లో కొల్లగొడుతూ జీహెచ్ఏంసీ ఆదాయానికి భారీగా గండికొడుతున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. గతంలో ఏసిబి వలకు చిక్కిన శేరిలింగంపల్లి సిటీ ప్లానర్ ఈయన గురువే కావడం  బహిరంగంగా రహస్యం . అయితే సదరు గురువు అడుగుజాడల్లోనే  ఈ అధికారి నడుస్తున్నారని టాక్ వినిపిస్తున్నది. ముఖ్యంగా చందానగర్ సర్కిల్ లో  సుమారు ఏడాది కాలంగా  టీపీయస్  లేకపోవడంతో ఆ అధికారి ఒకే ఒక్కడు తరహాలో చక్రం తిప్పుతున్నాడని సర్కిల్ లో ఆ నోటా ఈ నోటా వినిపిస్తున్నది.

నిద్ర మత్తులో జీహెచ్ఎంసి విజిలెన్స్  విభాగం..
మాదాపూర్ పోలిస్ స్టేషన్లో లంచం డిమాండ్ చేసిన ఓ ఎస్సైని ఓ వ్యక్తి ఏసీబి అధికారులకు  పట్టించిన  విషయం తెలిసిందే. అయితే ఇందులో సదరు టౌన్ ప్లానింగ్ అధికారి కూడా డబ్బులు ఇవ్వాలని  డిమాండ్ చేసినట్లు  పోలిసులకు పిర్యాదు చేశాడు. అయితే ఈ విషయంలో పోలీసులు మాత్రం చూసీ చూడనట్టు వ్యవహరించడం గమనార్హం. ఆ అధికారి ఇంతలా రెచ్చిపోతున్నా విజిలెన్స్  అధికారులు ఏం చేస్తున్నారని అంతుపట్టని వ్యవహారం. ఇప్పటికైనా అవినీతి జలగల నుంచి విముక్తి కల్పించాలని కోరుతున్నారు.

Recent

- Advertisment -spot_img