Homeహైదరాబాద్latest Newsఅర్ధరాత్రుళ్లు రోమింగ్ చేస్తోన్న యువతకు కౌన్సెలింగ్

అర్ధరాత్రుళ్లు రోమింగ్ చేస్తోన్న యువతకు కౌన్సెలింగ్

ఇదే నిజం, కొమురం భీం ఆసిఫాబాద్ : ఎలాంటి అవసరం లేకపోయినా అర్థరాత్రుళ్లు రోడ్లపై తిరుగుతూ కొందరు యువకులు నానా హంగామా చేస్తుంటారు. మద్యం మత్తులో రెచ్చిపోతూ ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తుంటారు. రాత్రుళ్లు బైక్‌లపై తిరుగుతూ వెకిలి చేష్టలకు పాల్పడుతుంటారు. ఇలాంటి వారికి అడ్డుకట్ట వేయడానికి ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ సురేష్ కుమార్గా ఆదేశాలు జారీ చేశారు. రం అసిఫాబాద్ డీఎస్పీ సదయ్య ఆధ్వర్యంలో నిన్న అర్ధరాత్రి ఆపరేషన్‌ చెబుత్రను పట్టణంలో నిర్వహించారు.

ఇందులో భాగంగా అర్ధరాత్రి దాటిన తర్వాత రోడ్లమీద బైక్ ల పై తిరుగుతూ అసాంఘిక చర్యలకు పాల్పడుతున్న యువతపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. దాదాపు 75 మంది యువకులను అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ ఇచ్చారు. డీఎస్పీ సదయ్య మాట్లాడుతూ.. అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవరూ అకారణంగా రోడ్లపైన తిరగవద్దని సూచించారు. ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమల్లో ఉందని, ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ లో తప్ప మిగతా సందర్భాలలో యువకులు రోడ్లు మీదకు రావద్దన్నారు. రోమింగ్ చేయొద్దని కోరారు. చాలామంది యువకులు నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలను స్పీడ్ గా డ్రైవ్ చేస్తున్నారని గుర్తుచేశారు. కొందరు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఇలాంటి వారందరినీ అడ్డుకట్ట వేయడానికి ఆపరేషన్ చెపుత్రా అనే కార్యక్రమాన్ని ఆసిఫాబాద్ పట్టణంలో నిర్వహిస్తున్నామన్నారు.

ఈ ఆపరేషన్ లో అసిస్టెంట్ కమాండెంట్ సిఆర్పిఎఫ్ రాకేష్, అసిఫాబాద్ పట్టణ సీఐ, రెబ్బెన సీఐ , వాంకిడి సీఐ, అసిఫాబాద్ పట్టణ ఎస్సైలు, వాంకిడి ఎస్ఐ, కెరమెరి ఎస్ఐ రెబ్బెన ఎస్సై లు, సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ ఫోర్స్, సివిల్ పోలీస్ కలిపి మొత్తం 60 మంది పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img