Homeఅంతర్జాతీయంWomen Rights : ఈ దేశాల్లో మహిళలకు వారిపై వారికే హక్కు లేదు

Women Rights : ఈ దేశాల్లో మహిళలకు వారిపై వారికే హక్కు లేదు

Women Rights : ఈ దేశాల్లో మహిళలకు వారిపై వారికే హక్కు లేదు

Women Rights : 57 దేశాలకు చెందిన 50 శాతం మంది మహిళలకు వారి శరీరాలపై హక్కులు లేవు.

ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి జనాభా నిధి (యూఎన్‌ఎఫ్‌పీఏ) తన నివేదికలో వెల్లడించింది.

ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలో 50 శాతం మంది మహిళలకు తమ శరీరాలపై హక్కులు లేవని తేలింది.

‘నా శరీరం నా సొంతం’ అని అధ్యయనానికి శీర్షికగా పెట్టారు. 57 దేశాల్లో మహిళల దుస్థితిని ఈ నివేదిక వివరించింది.

పరిమితులు

దాదాపు 50 శాతం మంది మహిళలు సెక్స్, గర్భనిరోధకం లేదా ఆరోగ్య సేవలను పొందడంలో అనేక పరిమితులను ఎదుర్కొంటున్నారు.

తీర్పు

మహిళలపై అనేక ఆంక్షలు భయం లేకుండా వారి శరీరానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోకుండా నిరోధిస్తున్నాయి.

మహిళల శరీరానికి సంబంధించిన నిర్ణయాలు మరొకరు తీసుకునేలా చాలా ఆంక్షలు ఉన్నాయి.

ప్రభావం

స్వయంప్రతిపత్తి లేకపోవడం మహిళలకు తీవ్రమైన హాని కలిగిస్తున్నది. అలాగే ఆర్థిక ఉత్పాదకత తగ్గుతున్నది.

ఆరోగ్య వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఖర్చులు కూడా పెరుగుతున్నాయి.

చట్టం

20 దేశాల్లో ఉన్న చట్టాల సాయంతో లైంగిక దాడికి గురైన బాధితురాలిని వివాహం చేసుకోవడం ద్వారా శిక్షను నివారించుకోవచ్చు.

43 దేశాల్లో వివాహితలపై జరుగుతున్న దుశ్చర్యలను అడ్డుకునే చట్టాలు లేవు. 30 దేశాల్లో మహిళల కదలికలపై ఆంక్షలు ఉన్నాయి.

హింస

మహిళలపై హింసను అరికట్టడానికి.. అత్యాచారం, బలవంతంగా స్టెరిలైజేషన్, కన్యత్వ పరీక్ష, జననేంద్రియ వైకల్యం నిర్వహిస్తారు.

లైంగిక విద్య

56 శాతం దేశాల్లో మాత్రమే లైంగిక విద్యను అందించడానికి చట్టాలు లేదా విధానాలు ఉన్నాయి.

యూఎన్‌ఎఫ్‌పీఏ డైరెక్టర్ నటాలియా కనెం ప్రకారం, కోట్ల మంది మహిళలు, బాలికలు తమ శరీరాలపై హక్కులు కలిగి లేరు. వారి జీవితాలు ఇతరులకు లోబడి ఉంటాయి.

Recent

- Advertisment -spot_img