Homeహైదరాబాద్latest Newsనేడు ప్రభాస్ 'కల్కి 2898ఎడి” నుంచి క్రేజీ అప్డేట్

నేడు ప్రభాస్ ‘కల్కి 2898ఎడి” నుంచి క్రేజీ అప్డేట్

దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ చిత్రం “కల్కి 2898ఎడి”. ఈ సినిమా విడుదల ఎప్పుడు అనేది ఉత్కంఠభరితంగా మారగా ఈ రిలీజ్ డేట్ అప్డేట్ కోసమే ఫ్యాన్స్ చాలా రోజులు నుంచి ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించే అవకాశముందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలాగే ఈరోజు సాయంత్రం 5 గంటలకి ఓ అప్డేట్ అందిస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. మరి మేకర్స్ ఇప్పటికే జూన్ 27ని ఫిక్స్ చేసినట్లు సమాచారం ఉండగా, ఈ అప్డేట్ లో అదే విషయాన్ని వెల్లడిస్తారో లేదో చూడాలి. మే 9న రిలీజ్ కావాల్సిన ఈ భారీ బడ్జెట్ మూవీ ఎన్నికల కారణంగా వాయిదా పడింది.

Recent

- Advertisment -spot_img