Homeసినిమాయూఎస్​లో ‘Salar’ అడ్వాన్స్​ బుకింగ్స్​పై క్రేజీ అప్​డేట్ ..

యూఎస్​లో ‘Salar’ అడ్వాన్స్​ బుకింగ్స్​పై క్రేజీ అప్​డేట్ ..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హసన్ జంటగా మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘సలార్’.దీపావళి రోజున మేకర్స్ సలార్​ నుంచి ఓ పవర్​ఫుల్ పోస్టర్​ను రివీల్ చేయగా.. డార్లింగ్ ఫ్యాన్స్​ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికే రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. వచ్చే నెల 21న రిలీజ్​ కానున్న ‘సలార్’ సినిమాకు సంబంధించి యూఎస్​లో అడ్వాన్స్​ బుకింగ్స్​పై క్రేజీ అప్​డేట్ బయటికి వచ్చింది. గురువారం సాయంత్రం 7.30 గంటలకు యూఎస్​లో బుకింగ్స్​కు సంబంధించి అప్​డేట్​ను రిలీజ్ చేయనున్నట్లు డిస్ట్రిబ్యూటర్స్ ప్రత్యంగిరా సినిమాస్ తెలిపింది. దీంతో యూఎస్​లోని ప్రభాస్​ ఫ్యాన్స్​తో పాటు నార్మల్ ఆడియెన్స్​ సైతం అప్​డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.

Recent

- Advertisment -spot_img