Homeక్రైంCrime News : ఆగివున్న లారీని ఢీకొట్టిన బైక్‌

Crime News : ఆగివున్న లారీని ఢీకొట్టిన బైక్‌

– ఇద్దరు మృతి

ఇది నిజం, ప్రతినిధి వరంగల్‌: ఆగివున్న లారీని ఓ ద్విచక్ర వాహనం ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన రాయపర్తి మండలం కిష్టాపూర్‌ క్రాస్‌ వద్ద చోటు చేసుకున్నది. ఇందుకు సంబంధించిన వివరాలు, ప్రత్యక్ష సాక్షులు పోలీసుల కథనం ప్రకారం. వరంగల్‌ వైపు వెళ్తున్న లారీని డ్రైవర్‌ కిష్టాపూర్‌ క్రాస్‌ వద్ద నిలిపి టైర్లు చెక్‌ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై వేగంగా వచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో సంగెం మండలం తూర్పు తండాకి చెందిన బోడ తులసి రామ్‌ (41), ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన కృష్ణా జిల్లా వాసి శనక జయంతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వర్ధన్నపేట సీఐ ఎస్‌ శ్రీనివాస్‌ తెలిపారు. అయితే , ప్రమాదంలో మృతి చెందిన సంగం మండలం తూర్పు తండాకు చెందిన తులసి రామ్‌, ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా జిల్లా వాసి శనగ జయంతులకు ఉన్న సంబంధం ఏమిటి..!? వీరు ఇరువురు ఎక్కడ కలుసుకున్నారు…!? అనే విషయం స్థానిక పోలీసులకు ప్రశ్నార్ధకంగా మారింది. ఇందుకు సంబంధించి తులసీరామ్‌ కుటుంబ సభ్యులు పోలీస్‌ విచారణలో శనక జయంతు తమకు తెలియదని వెల్లడిరచినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి విచారణ జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడిరచారు.

Recent

- Advertisment -spot_img