Homeక్రైంCrime News : US​లో కత్తి దాడికి గురైన ఖమ్మం యువకుడి మృతి

Crime News : US​లో కత్తి దాడికి గురైన ఖమ్మం యువకుడి మృతి

– మామిళ్లగూడెంలో విషాదఛాయలు

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: అమెరికాలో కత్తి దాడికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖమ్మం జిల్లాకు చెందిన యువకుడు వరుణ్‌రాజ్‌ (29) మృతి చెందాడు. ఈ మేరకు కుటుంబసభ్యులకు బుధవారం సమాచారం అందింది. దీంతో వరుణ్‌ ఇంటివద్ద విషాదఛాయలు అలముకున్నాయి. ఖమ్మంలోని మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన వరుణ్‌ ఏడాదిన్నర క్రితం అమెరికా వెళ్లాడు. యూఎస్​లోని ఇండియానా రాష్ట్రంలో ఓ యూనివర్సిటీలో ఎంఎస్‌ చదువుతూ పార్ట్‌టైం జాబ్‌ చేస్తున్నాడు. గత నెల 31న జిమ్‌ నుంచి ఇంటికి వెళ్తుండగా ఓ దుండగుడు కత్తితో వరుణ్‌పై పొడిచాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని యువకుడిని ఆస్పత్రికి తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న వరుణ్‌కు డాక్టర్లు సర్జరీ చేశారు. అప్పటి నుంచి అక్కడ చికిత్స పొందుతున్న వరుణ్​ చనిపోయినట్లు మామిళ్లగూడెంలోని అతడి కుటుంబసభ్యులకు సమాచారం అందింది. దీంతో వారు కన్నీరుమున్నీరవుతున్నారు. వరుణ్‌ తండ్రి రామ్మూర్తి మహబూబాబాద్‌ జిల్లాలో టీచర్​గా పనిచేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img