Homeక్రైంCrime News : సీరియల్‌ కిల్లర్‌ అరెస్ట్‌

Crime News : సీరియల్‌ కిల్లర్‌ అరెస్ట్‌

– గుప్త నిధుల పేరుతో అనేక మందిని మభ్యపెట్టిన హంతకుడు

– ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు

ఇదేనిజం, నాగర్‌కర్నూల్‌ : తాంత్రిక పూజల పేరుతో 11 మందిని హత్య చేసిన సీరియల్‌ కిల్లర్‌ సత్యనారాయణ(47)ను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటి వరకు ఎనిమిది కేసుల్లో సత్యనారాయణ నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి పాయిజన్‌ బాటిల్స్‌తో పాటు బాధితుల ఫోన్లు, పది సిమ్‌కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2020 నుంచి నిందితుడు వరుస హత్యలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడి నుంచి మారుతీ స్విఫ్ట్‌ కారును సీజ్‌ చేశారు. సత్యనారాయణ నాగర్‌కర్నూల్‌ జిల్లా ఇంద్రానగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నారని పోలీసులు పేర్కొన్నారు. వనపర్తి, నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌, కల్వకుర్తి, కర్ణాటకలోని బలగనూరు, ఏపీలోని అనంతపురం జిల్లాల్లో హత్యలు చేశారు. గుప్త నిధుల పేరుతో అనేక మందిని మభ్య పెట్టేవాడు. తాంత్రిక పూజలు చేసి గుప్త నిధులు కనిపెడుతానని నమ్మించేవాడు. అమాయకుల నుంచి డబ్బు, స్థలాలు, భూములు రాయించుకునేవాడు. తర్వాత నిర్మానుష్య ప్రదేశాలకు తీసుకెళ్లి హత్య చేసేవాడు. తీర్థం పేరుతో నోట్లో యాసిడ్‌ పోసి చంపేవాడు. ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులన్నింటినీ కోర్టులో ప్రవేశపెడుతామని చెప్పారు. నిందితుడికి ఉన్న ఆస్తులన్నింటిపై దర్యాప్తు జరుపుతామని స్పష్టం చేశారు. వనపర్తి జిల్లాలో నలుగురిని, నాగర్‌కర్నూల్‌ పీఎస్‌ పరిధిలో ఇద్దరిని, కొల్లాపూర్‌లో ఒకరిని, కల్వకుర్తిలో ఒకరిని చంపాడు. కర్ణాటక రాష్ట్రం బలగనూరులో ఒకరిని, ఏపీ అనంతపురం జిల్లా పెద్దవడుగూరు పీఎస్‌ పరిధిలో ఒకరిని చంపినట్లు పోలీసులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img