Homeతెలంగాణసాగు పెరిగింది... ఎరువులు ఎక్కువ పంపండి..

సాగు పెరిగింది… ఎరువులు ఎక్కువ పంపండి..

కేంద్రానికి మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి వినతి

ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలతో ఢిల్లీలో కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖా మంత్రి సదానందగౌడను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కలిసి తెలంగాణకు రావాల్సిన యూరియా కోటా వెంటనే సరఫరా చేయాలని కోరారు. ఈ సందర్బంగా మంత్రి పలు విషయాలను చెర్చించడం జరిగింది. సాగు పెరిగిందని, రాష్ట్రానికి ఇచ్చే ఎరువుల కోటా పెంచండని మంత్రి కోరారు. కేటాయించిన యూరియా కోటాను కూడా వెంటనే పంపించాలని కోరారు.  తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సానుకూల విధానాలు, కలిసివచ్చిన వాతావరణ పరిస్థితులతో తెలంగాణలో గణనీయంగా సాగువిస్తీర్ణం పెరిగిందని రాష్ట్ర మంత్రి తెలిపారు.

తెలంగాణలో కోటి 25 లక్షల ఎకరాలు సాగయిందని, మరో 8.5 లక్షల ఎకరాలలో ఉద్యానపంటలున్నాయని, మరో ఆరేడు లక్షల ఎకరాలలో వరినాట్లు వేయాల్సి ఉందని తెలిపారు. మొత్తంగా తెలంగాణలో ఈ వానాకాలంలో దాదాపు ఒక కోటి 41 లక్షల ఎకరాలలో పంటలు సాగవుతాయని అంచనా వేశారు. సాగు విస్తీర్ణం పెరిగిన నేపథ్యంలో ఎరువుల వాడకం కూడా గణనీయంగా పెరిగిందన్నారు.  గత ఏడాది ఈ రోజు వరకు 3.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వాడితే, ఈ ఏడాది ఈ రోజు వరకు ఏడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వాడడం జరిగింది. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో వర్షపాతం నమోదు అయింది. సాగునీటి రాకతో గతంతో పోల్చితే ఆరేళ్లుగా సాగు విస్తరణ పెరుగుతుంది అని అన్నారు మంత్రి నిరంజన్​ రెడ్డి.

 పెరిగిన సాగును పరిగణనలోకి తీసుకుని ఎరువుల కోటా పెంచి సరఫరా చేయండని, తెలంగాణకు ఈ వానాకాలానికి పదిన్నర లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించడం జరిగింది. ఈ నెల కోటాగా రెండున్నర లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉందని, కానీ ఇప్పటి వరకు రాష్టానికి 80 వేల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే  వచ్చిందని, మిగిలిన మొత్తం వెంటనే పంపించండని కోరారు.

ఆగస్టు నెలలో ఎరువులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయ రంగం దేశాన్ని బతికిస్తుంది, తెలంగాణ ప్రభుత్వం ఆ వ్యవసాయాన్ని బతికిస్తున్న రైతన్నలకు వెన్నుదన్నుగా ఉంటుందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో ఏ ఏ గ్రామాల్లో ఎంత పంట వేశారు అనేది ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా  లెక్కలు నమోదుచేసింది. రాష్ట్ర మంత్రితో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్థన్ రెడ్డి కూడా కేంత్ర మంత్రిని కలిశారు. రాష్ట్ర మంత్రి అభ్యర్థనలకు కేంద్ర మంత్రి సదానందగౌడ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు మంత్రి నిరంజన్​ రెడ్డి.

Recent

- Advertisment -spot_img