Homeహైదరాబాద్latest NewsCyber Crime: ఫేస్‌బుక్‌లో పరిచయం.. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో భారీ మోసం..

Cyber Crime: ఫేస్‌బుక్‌లో పరిచయం.. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో భారీ మోసం..

హైదరాబాద్‌ నగరానికి చెందిన ఓ డాక్టర్‌(బేరియాట్రిక్‌ సర్జన్‌)ను ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకున్న సైబర్‌ నేరగాడు.. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో రూ.41.28లక్షలు కొల్లగొట్టాడు. మోసపోయినట్లు గుర్తించిన డాక్టర్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఫేస్‌బుక్‌లో డాక్టర్‌కు పరిచయమైన వ్యక్తి కాయిన్‌ మార్కెట్‌ డాట్‌ విన్‌ ట్రేడింగ్‌ పేరుతో మోసగించి పెద్దమొత్తంలో డబ్బులు దోచుకున్నాడని తెలుస్తుంది. కొద్దిరోజులు తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టించిన నేరగాడు.. మంచి లాభాలు వచ్చినట్లు నమ్మించాడు. అనంతరం అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టించి విత్‌డ్రా ఆప్షన్‌ను, లాభాలు వచ్చినట్లు చూపించే ఆప్షన్‌ సైతం క్లోజ్‌ చేశాడు.

Recent

- Advertisment -spot_img