Homeజిల్లా వార్తలుదళితబంధు అమలు చేయాలి

దళితబంధు అమలు చేయాలి

– పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం సమర్పించిన దళిత జేఏసీ నాయకులు

ఇదేనిజం, ములుగు ప్రతినిధి : దళితబంధు పథకానికి ఎంపిక అభ్యర్థులకు దళిత బంధు డబ్బులు మంజూరు చేయాలని దళిత జేఏసీ నాయకులు కోరారు. సోమవారం ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం పంచాయతీ కార్యదర్శికి దళిత జేఏసీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను అక్టోబరులో ఎంపిక చేశారని నవంబరులో ఎన్నికల కోడ్‌ రావటం దళిత బంధు పథకం నిలిచిపోయిందన్నారు. ఎంపికైన అర్హులకు పథకాన్ని వర్తింపజేయాలని కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో కమలాపురం నాయకులు గోమాస చందర్‌ రావు, బీస్‌ సాంబయ్య, యాసం హరీశ్‌, గంగెర్ల వెంకటేశ్వర్లు, జాడి రవి, కదురు మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img