Danger with some Types of Earbuds : బ్లూటూత్ హెడ్‌ఫోన్‌లు ఇటీవలి కాలంలో ఎక్కువగా ప్రజాదరణ పొందుతున్నాయి.
మార్కెట్లో వివిధ రకాల్లో ఎయిర్‌పాడ్స్, ఇయర్‌బడ్స్, వైర్‌లెస్ నెక్‌బ్యాండ్స్ దొరుకుతున్నాయి.
చిన్న బ్లూటూత్ హెడ్‌ఫోన్‌లు వైర్‌లెస్ ద్వారా మనకు ఎంతో సహాయపడుతున్నాయి.
అయితే వీటి ద్వారా విడుదలయ్యే రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ కూడా ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.
ఒక పరిశోధన ప్రకారం, బ్లూటూత్ ఇయర్‌బడ్స్ అధికంగా ఉపయోగించడం వల్ల మెదడు క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
అమెరికాలోని కొలరాడో విశ్వవిద్యాలయం బయోకెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ జెర్రీ ఫిలిప్స్ పరిశోధన ప్రకారం, బ్లూటూత్ లేదా వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్ వాడకం వల్ల మెదడు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి.
ఇయర్ బడ్స్ నుంచి వెలువడే తరంగాలు మెదడు కణజాలాన్ని దెబ్బతీస్తాయి.
ఇయర్ బడ్స్ నుంచి వెలువడే విద్యుదయస్కాంత పౌనఃపున్యం మన శరీరానికి చాలా హాని కలిగిస్తుంది.
వైర్‌లెస్ హెడ్‌ఫోన్లను అధికంగా ఉపయోగించడం వల్ల జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంది.
వీటి వల్ల చిన్నారులు, గర్భిణుల్లో కూడా ఎక్కువగా ప్రమాదం ఉన్నది.
అలాగే, న్యూరోలాజికల్ ఆరోగ్య సమస్యలు, జన్యుపరమైన రుగ్మతలు వంటి తీవ్రమైన వ్యాధులకు కూడా కారణమవుతుంది.
చెవిపోటు వచ్చే అవకాశాలు ఉంటాయి. వినికిడి కోల్పోవడం, వినికిడి సమస్యలు వస్తాయి.
చెవిలో ఇన్‌ఫెక్షన్లు వచ్చేందుకు ఎక్కువ ఆస్కారం ఉన్నది. టెటానస్‌తో పాటు తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలు కూడా చుట్టుముడతాయి.
జెర్రీ ఫిలిప్స్ పరిశోధనకు ముందు, వైర్‌లెస్ పరికరాల నుంచి విడుదలయ్యే విద్యుదయస్కాంత క్షేత్రాలతో సంబంధమున్న ఆరోగ్య ప్రభావాల గురించి పరిశోధన జరుపాలని దాదాపు 42 దేశాలకు చెందిన 247 మంది శాస్త్రవేత్తలు ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కు విజ్ఞప్తి చేశారు.
నివారణ ఎలా..?
ఆధునిక సాంకేతికత, అవసరాలను పరిగణనలోకి తీసుకుంటే, ఈ సాధనాలను పూర్తిగా పక్కన పెట్టడం సాధ్యం కాదు.
అయితే, తప్పనిసరిగా ఉపయోగించాల్సి వస్తే ఈ విషయాలను గుర్తుంచుకోండి.
వైర్డ్ హెడ్‌ఫోన్లు, స్పీకర్లను ఎక్కువగా వినియోగించాలి.
10 ఇంచుల దూరంలో ఫోన్ పట్టుకుని మాట్లాడాలి.
ఉపయోగంలో లేనప్పుడు హ్యాండ్‌సెట్‌లు, ఫోన్‌లు, ఇతర గాడ్జెట్లను శరీరానికి దూరంగా ఉంచాలి.
దిండు కింద ఫోన్ పెట్టుకుని నిద్రపోకుండా చూసుకోవాలి.
వీడియోను చూడటానికి లేదా ఎక్కువసేపు ఆడియో వినడానికి స్పీకర్‌ని ఉపయోగించండి.
నిద్రపోతున్నప్పుడు ఫోన్, ఇతర గాడ్జెట్లను దూరంగా ఉంచాలి.
చౌవకైన ఇయర్‌ఫోన్లకు బదులుగా నాణ్యత గలవి వాడాలి.
ఒక రోజులో 60 నిమిషాల కంటే ఎక్కువ ఇయర్‌ఫోన్లు వాడకుండా చూసుకోవాలి.