Homeహైదరాబాద్latest Newsడార్లింగ్ ఫ్యాన్స్ కు నిరాశ తప్పదా..‘ది రాజాసాబ్‌’ మూవీ వాయిదా పడ్డట్లేనా..?

డార్లింగ్ ఫ్యాన్స్ కు నిరాశ తప్పదా..‘ది రాజాసాబ్‌’ మూవీ వాయిదా పడ్డట్లేనా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ‘రాజాసాబ్’ అనే సినిమా చేసాడు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా రొమాంటిక్ హారర్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఈ సినిమా 2025 ఏప్రిల్ 10న విడుదల కానుందని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. ఈ సినిమా షూటింగ్‌ ముందు అనుకున్నట్లుగా పూర్తి అయినప్పటికీ, ఈ సినిమా కోసం వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ ఎక్కువ ఉన్న కారణంగా చెప్పిన తేదీకి విడుదలయ్యే అవకాశాలు లేవని అంటున్నారు. అదే సమయంలో యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ‘జాక్’ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమా 2025 ఏప్రిల్ 10న విడుదల కానుందని తెలిపారు. అయితే రాజాసాబ్ సినిమా వాయిదా పడుతుందనే విషయంపై క్లారిటీ ఉందని అందుకే అదే రోజు విడుదల చేస్తున్నారని తెలుస్తుంది. అందుకే రాజాసాబ్ సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.

Recent

- Advertisment -spot_img