రాజకీయాల్లో సన్ స్ట్రోక్ గురించి ఎక్కువగా విన్నాం. కానీ డాటర్ స్ట్రోక్ గురించి వినడం తక్కువే. మరీ ముఖ్యంగా తెలుగు రాజకీయాల్లో కొడుకుల వల్ల ఇబ్బంది పడ్డ నాయకులున్నారే తప్ప, కూతుళ్ల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్లు ఎవరూ లేరని చెప్పొచ్చు. తాజాగా డాటర్ స్ట్రోక్ చరిత్ర లేని లోటును కేసీఆర్ కూతురు కవిత తీరుస్తున్నారు.
కేసీఆర్.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన చేసిన పోరాటం ఎవ్వరం మరచిపోలేము. అలాగే 10 సంవత్సరాలు ముఖ్యమంతిగా ఉండి రాష్ట్రాన్ని ఎవ్వరూ ఊహించనంతగా అభివృద్ధి చేశాడు. కేసీఆర్ మాట వింటే ప్రత్యర్థుల గుండెల్లో భయం పుట్టేది. అలాంటి కేసీఆర్ కు ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం లో అరెస్ట్ అయ్యి 100 రోజులు పైనే అవుతున్న కేసీఆర్ ఏం చేయలేకపోతున్నారు. బెయిల్ కోసం పెద్ద నాయకులతో మాట్లాడి చేయిద్దామంటే సెంట్రల్ పార్టీ బీజేపీ ఆయనకు వ్యతిరేకమే, అలాగే స్టేట్ పార్టీ కాంగ్రెస్ ఆయనకు వ్యతిరేకమే, ఎలా ఏమి చేయలేని పరిస్థితిలో కేసీఆర్ కు ఏర్పడింది. ఆఖరికి జైల్లో ఉన్న కవితను చూడడానికి కూడా వీలులేని పరిస్థితి, ఎందుకంటే కేసీఆర్ కవితను చూడడానికి వెళ్తే.. అదొక పెద్ద వార్తా.. అప్పుడు ఈ లిక్కర్ స్కాం టాపిక్ మరింత హైలెట్ అవుతుంది. అందుకని ఆయన సైలెంట్ గా ఉన్నారు. దీంతో కేసీఆర్ ఏం చేయలేక పీకల్లోతు బాధతో కృంగిపోతున్నారు.