Homeక్రైంDCP phone hack.. DCP ఫోన్ హ్యాక్..

DCP phone hack.. DCP ఫోన్ హ్యాక్..

– ఉద్యోగిపై చేయిచేసుకున్న డీసీపీ
– రివేంజ్​ తీసుకున్న ఐటీ ఎంప్లాయిస్​

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : తమపై చేయి చేసుకున్నాడనే కారణంతో ఐటీ ఉద్యోగులు ఏకంగా పోలీస్ వర్గాల్లో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఫోన్​నే హ్యాక్ చేశారు. దీంతో కంగుతిన్న సదరు అధికారి హ్యాకర్లను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ ఐటీ కారిడార్​లో ఇటీవల ఉద్యోగులంతా స్వచ్ఛందంగా ర్యాలీ నిర్వహించారు. ఆ టైంలో సైబరాబాద్ డీసీపీ ఓ ఐటీ ఉద్యోగిపై చేయి చేసుకున్నాడు.

దీంతో తోటి ఉద్యోగులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీసీపీకి బుద్ధి చెప్పాలని ఉద్యోగులంతా ఓ ప్లాన్ వేసి, సదరు అధికారి ఫోన్ హ్యాక్ చేసి ఫోన్​లోని డేటా మళ్లీ డీసీపీకే పంపించారు. అంతేకాదు తమను బెదిరించిన మిగతా పోలీస్ అధికారుల ఫోన్లు హ్యక్ చేస్తామని హెచ్చరించారు. గతంలోనూ మహిళా డీసీపీ ఫోన్​ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. అయితే ఈ పని ఒక్కరు చేశారా? లేక అందరూ కలిసి చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img