Homeహైదరాబాద్latest Newsఅనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

ఇదే నిజం, కోరుట్ల : కోరుట్ల శివారులో గల ఏసుకోనిగుట్టపైనున్న కాలనీలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం…

బుధవారం రోజున రాత్రి 11:30 గంటల సమయంలో కోరుట్ల పట్టణం ఏసుకొని గుట్ట కు చెందిన సయ్యద్ అజ్మత్ (31) అను అతను ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన ఇంటిలోనే సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకున్నారు. మృతుడి బంధువులు, గమనించి త్వరితగతిన ఉరి నుండి దించి అప్పటికప్పుడే హాస్పిటల్ కి తరలించారు. కాగా..అప్పటికే అజ్మత్ చనిపోయి ఉన్నాడని వైద్యులు నిర్ధారించారు. అయితే..మృతుడి మరణం పై అనుమానం ఉందని మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img