Homeజాతీయండీప్​ ఫేక్​ ఎంతో డేంజర్​

డీప్​ ఫేక్​ ఎంతో డేంజర్​

– నేను పాటపాడినట్టు వీడియో సృష్టించారు
– ప్రధాని నరేంద్ర మోడీ

ఇదేనిజం, నేషనల్​ బ్యూరో: డీప్​ ఫేక్​ టెక్నాలజీ ఎంతో డేంజర్​ అని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. తాను పాట పాడినట్టు కూడా ఓ వీడియోను సృష్టించారని పేర్కొన్నారు. ఈ ధోరణి వ్యవస్థకు పెను ముప్పని పేర్కొన్నారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడారు. కృత్రిమ మేధను దుర్వినియోగం చేసి ఇలా డీప్‌ఫేక్‌ వీడియోలు సృష్టించడం పెను ఆందోళనకరమని అన్నారు. ఇటువంటి వీడియోలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు.

Recent

- Advertisment -spot_img