HomeసినిమాDeepika Padukone : కామినేని హాస్పిట‌ల్‌కు దీపిక ప‌దుకొణే

Deepika Padukone : కామినేని హాస్పిట‌ల్‌కు దీపిక ప‌దుకొణే

Deepika Padukone : కామినేని హాస్పిట‌ల్‌కు దీపిక ప‌దుకొణే

Deepika Padukone : బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపిక ప‌దుకొణే మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లోని కామినేని ఆసుప‌త్రిలో చేరారు.

ఓ సినిమా షూటింగ్ నిమిత్తం ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో ఉంటున్న దీపికకు మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి హార్ట్ బీట్ పెరిగిపోయింద‌ట‌.

దీంతో కంగారుప‌డ్డ ఆమె షూటింగును ర‌ద్దు చేసుకుని హుటాహుటీన కామినేని ఆసుపత్రికి వ‌చ్చారు.

అక్కడ ప్రాథ‌మిక చికిత్స అనంత‌రం ఆమె తాను బ‌స చేసిన నోవాటెల్ హోట‌ల్‌కు వెళ్లిపోయారు.

నోవాటెల్‌లోనూ ఆమె వైద్యుల ప‌ర్యవేక్ష‌ణ‌లోనే ఉన్న‌ట్లు స‌మాచారం.

ప్ర‌స్తుతం దీపిక ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని, ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం ఏమీ లేద‌ని ఆమెకు వైద్యులు సూచించిన‌ట్టు స‌మాచారం.

దీనికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img