హైదరాబాద్, ఇదేనిజం – రెయిన్ బజార్ పీఎస్ సీఐ ఆంజనేయులు వెల్లడి…. పాతబస్తీ యాకుత్‌పురా రెయిన్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రీ 9గంటల సమయంలో సయ్యద్ఆయాజ్ఉద్దీన్–32, రౌడీషీటర్ దారుణ్య హత్యకు గురైన విషయం విధితమే… ఈ మర్డర్‌కు సంబందించిన పూర్తి వివరాలను ఏసీపీ బత్తుల ఆనంద్, సీఐ ఆంజనేయులుతో కలిసి వెల్లడించారు. యాకుత్‌పురా బస్తీకి చెందిన సయ్యద్ఆయాజ్ఉద్దీన్–32, రౌడీషీటర్, ఇతడు గతేడాది మొగల్పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక రౌడీషీటర్ అమెర్పఠాన్ అను తన మిత్రులతోకలిసి కత్తులో ఆతిదారుణంగా పోడిచి హత్య చేయడంతో అతడు సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. దీంతో మొగల్పురా పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తుచేసి నిందితులను పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. అయితే ఇ హత్యలో ప్రధాన నిందితుడు సయ్యద్ఆయాజ్ ఆలీయాస్ కండా ఆయాజ్–32, చేశాడని కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. దీంతో ఆనాటినుంచి సమయం కోసం ఎదురుచుస్తున్నారు. అయతే శనివారం రాత్రీ 9గంటల సమయంలో ఆయాజ్ఉద్దీన్ యాకుత్‌పురా వెస్ట్ చంద్రానగర్ బస్తీ డీకాషన్ హోటల్ వద్ద ఉన్నాడని సమాచారం అందుకున్న ఆమేర్ సోదరులు ఇతరులతోకలిస బైక్‌పై అక్కడికి చేరుకుని ఆయాజ్ఉద్దీన్పై కత్తులతో విక్షణ రహితంగా దాడిచేయడంతో సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని డెడ్‌బాడిని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ మర్డర్ వెనుక బలమైన కారణాలు ఉన్నాయని అనుమానంతో సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ టీం, రంగంలోకి దిగి నిందితుల వేట కోనసాగించింది. అయితే గురువారం యాకుత్‌పురా రెయిన్ బజార్ బస్తీలోని ఒక గుర్తుతెలియని ఇంటిలో మర్డర్చేసిన నిందితులు ఉన్నారన్న సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్ ఎస్ఐలు, రెయిన్‌బజార్ పోలీసులు ఆకస్మికంగా దాడిచేసి నిందితులు 1 అహ్మద్‌హుసేన్ ఆలీయాస్ గజీని ఆమేర్–26, మహ్మద్ మసీఉద్దీన్–23, మహ్మద్ సల్మాన్‌ఖాన్–30, మహ్మద్ ఇలీయాస్ ఆలీయాస్ జానీ–26, మహ్మద్ ఇబ్రాహీంఖాన్ ఆలీయాస్ అబ్బు–25, మహ్మద్ అస్లంఖాన్ ఆలీయాస్ ఆషు–23, మహ్మద్ ఇమ్రాన్‌ఖాన్–26, తదితరులను అదుపులోకి తీసుకుని వారివద్ద నుంచి మూడుబైకులు, నాలుగు కత్తులు స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించి విచారించగా నేరం అంగికరించడంతో వారిపై మర్డర్ సెక్షన్ ప్రకారం కేసు నమోదుచేసి నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరిచి న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు. అయితే పోలీసు విచారణలో ఇందులో పేరుమోసిన ఇద్దరు రౌడీషీటర్ మసీఉద్దీన్, అహ్మద్‌హుసేన్, కీలక పాత్రం పోషించారని తెలింది.
రౌడీషీటర్ ఆయాజ్ ఉద్దీన్ మర్డర్ కేసులో నిందితులు రిమాండ్
RELATED ARTICLES