Delhi Elections: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 47 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఇక అధికార ఆప్ పార్టీ కేవలం 23 స్థానాలకే పరిమితమైంది. దీంతో దాదాపు 27 ఏళ్ల తర్వాత రాజధానిలో కాషాయా జెండా ఎగరబోతోంది. ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ ఓటర్లు అవినీతిని ఓడించారంటూ ఆప్‌పై విమర్శలు చేస్తున్నారు.