HomeసినిమాDelhi is coming again…! ఢిల్లీ మళ్లీ వస్తున్నాడు…!

Delhi is coming again…! ఢిల్లీ మళ్లీ వస్తున్నాడు…!

ఎల్​సీయూ(లోకేశ్​ సినిమాటిక్ యూనివర్స్) కాన్సెప్ట్​తో ఖైదీ, విక్రమ్, లియో సినిమాలు తెరకెక్కించి బ్లాక్ బ్లస్టర్ హిట్లు కొట్టాడు తమిళ స్టార్ డైరెక్టర్​ లోకేశ్ కనగరాజ్. ఇళయ దళపతి విజయ్​తో తీసిన ‘లియో’ఇటీవల రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. అయితే, లోకేశ్ ఎల్​సీయూ కాన్సెప్ట్​లో భాగంగా తీసిన మొదటి సినిమా ఖైదీ. 2019లో వచ్చిన ఈ మూవీలో కార్తీ హీరోగా నటించాడు. లోకేశ్​ ఎల్​సీయూ కాన్సెప్ట్​ మూవీస్​లో ది బెస్ట్ వర్క్​గా ఖైదీ నిలిచింది. తాజాగా లియో సినిమా రిలీజైనప్పటి నుంచి ఫ్యాన్స్ మళ్లీ ఖైదీ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఖైదీలో కార్తీ చేసిన ‘ఢిల్లీ’క్యారెక్టర్ సోషల్ మీడియాలో వైరల్​గా మారుతోంది. ఈ సినిమా వచ్చి అప్పుడే నాలుగేళ్లు అయ్యిందంటూ తాజాగా నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఓ వీడియో రిలీజ్ చేసింది. ‘ఢిల్లీ’మళ్లీ రాబోతున్నాడంటూ ఓ క్రేజీ అప్​డేట్​ను వీడియోలో అందించింది. మరోసారి అందరి ఎగ్జయిట్​మెంట్​కు ఏ మాత్రం తగ్గకుండా సెటిల్ చేసేలా ఖైదీ–2 ఉంటుందని డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ సంస్థ తెలిపింది. దీంతో మూవీ లవర్స్​ ఖైదీ–2 కోసం ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు.

Recent

- Advertisment -spot_img