Homeహైదరాబాద్latest Newsసీఎం రేవంత్ కు ఢిల్లీ పోలీసులు నోటీసులు

సీఎం రేవంత్ కు ఢిల్లీ పోలీసులు నోటీసులు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోపై వివరణ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కి ఆదేశాలు జారీ చేశారు. మే 1న విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. రిజర్వేషన్ల అంశం మీద అమిత్ షాపై కాంగ్రెస్ నేతలే ఫేక్ వీడియోను క్రియేట్ చేశారని బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. రిజర్వేషన్ల అంశంలో అమిత్ షా ఫేక్ వీడియోను షేర్ చేశారంటూ పలువురు కాంగ్రెస్ నేతలకు సమన్లు ఇచ్చారు. అయితే ఇండియా కూటమి నేతలు ఫేక్ వీడియోలను ప్రచారం చేస్తున్నారని ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు.

Recent

- Advertisment -spot_img