HomeసినిమాDesire for beauty అందాల ఆకాంక్ష

Desire for beauty అందాల ఆకాంక్ష

ఆరేండ్ల కిందట వచ్చిన ‘మళ్లీ రావా’సినిమాతో టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది రాజస్థాన్ బ్యూటీ ఆకాంక్ష సింగ్. సుమంత్ హీరోగా నటించిన ఈ సినిమాలో తన నటనతో ఆమె ఆకట్టుకుంది. మొదటి సినిమాకే మంచి మార్కులు కొట్టేసింది. జైపూర్​లో పుట్టి పెరిగిన ఆకాంక్ష.. ‘నా బోలె తుం నా కుచ్ కహ’అనే టీవీ సీరియల్​తో బుల్లెతెరకు పరిచయమై పేరు తెచ్చుకుంది. 2013లోనే పెళ్లి చేసుకున్న ఆమె.. 2017లో మళ్లీ రావా సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా డీసెంట్ హిట్ కొట్టినప్పటికీ ఆకాంక్షకు మాత్రం ఆఫర్లు క్యూ కట్టలేదు. 2018లో నాగార్జున, నాని మల్టీస్టారర్ ‘దేవదాస్’లో కనిపించిన ఆకాంక్ష ఆ తర్వాత మళ్లీ తెలుగు సినిమాలో నటించలేదు. అయితే, పరంపర, మీట్ క్యూట్ లాంటి తెలుగు వెబ్​ సిరీసుల్లోనూ నటించి మెప్పించింది. కన్నడలో ‘పహిల్వాన్’​సినిమాలో సుదీప్​కు జోడిగా నటించిన ఆకాంక్ష.. సోషల్ మీడియాలో యాక్టివ్​గా ఉంటూ ఫొటోలను అప్​లోడ్ చేస్తుంటుంది. తాజాగా.. ట్రెడిషనల్ వేర్​లో క్యూట్​ లుక్స్​తో ఉన్న ఫొటోలను ఇన్​ స్టాలో అప్​లోడ్ చేసింది. ఆకాంక్ష అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. క్యూట్ లుక్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img