Homeఫ్లాష్ ఫ్లాష్దేవర 80 శాతం షూటింగ్ కంప్లీట్

దేవర 80 శాతం షూటింగ్ కంప్లీట్

గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్​గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘దేవర’. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో పాన్ ఇండియా లెవెల్​లో మంచి హైప్ నెలకొంది. అయితే, రానున్న కొన్ని రోజుల్లో దేవర గ్లింప్స్ కూడా వచ్చే చాన్స్ ఉందని గట్టి టాక్ వినిపించింది. దేవర సినిమాపై ఎన్టీఆర్ సోదరుడు, హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ఇంట్రెస్టింగ్ అప్​డేట్ అందించాడు. తన లేటెస్ట్ మూవీ డెవిల్ ప్రమోషన్స్​లో భాగంగా కళ్యాణ్​ రామ్ మాట్లాడుతూ.. దేవర సినిమా 80 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యిందని కన్ఫర్మ్ చేశాడు. అదే విధంగా దేవర ఫస్ట్ గ్లింప్స్, వీఎఫ్​ఎక్స్ పనులు అనుకున్న టైమ్​కు కంప్లీట్ అయితే రిలీజ్​ డేట్​ను అనౌన్స్​ చేస్తామన్నాడు. దేవర మూవీలో బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్​గా నటిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వచ్చే ఏడాది ఉగాది కానుకగా ఈ సినిమా రిలీజ్​ కానుంది.

Recent

- Advertisment -spot_img