Homeహైదరాబాద్latest Newsదేవరకొండ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలి: డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్.

దేవరకొండ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలి: డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్.

ఇదే నిజం, దేవరకొండ: దేవరకొండ నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం నిన్న సమావేశం ఏర్పాటు చేశారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సామాజికవేత్త డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతమైన గిరిజన నియోజకవర్గంలో ఎక్కువగా ఎస్సీ, ఎస్టి, బీసీ,మైనారిటీ నిరుపేదలు ఎక్కువగా ఉండే నియోజకవర్గం గతం 30 సంవత్సరాల నుండి దేవరకొండ మారుమూల ప్రాంతం నియోజకవర్గం అయినా తెలంగాణ రాష్ట్రంలో దేవరకొండకు మంత్రి వర్గంలో చోటు కల్పించలేదు. నేనావత్ బాలు నాయక్ కు సామాన్య కార్యకర్త నుంచి జడ్పిటిసిగా, మార్కెట్ కమిటీ చైర్మన్గా, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ గా, జిల్లా పరిషత్ చైర్మన్గా, రెండోసారి అందరూ ప్రజల మధ్య భారీ మెజార్టీతో గెలిచి ప్రజల యొక్క అభిమానాన్ని పొందారు. ప్రజలకు చేరువై ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి నక్కలగండి ప్రజెంట్, ఎస్ఎల్బీసీ, మహిళా డిగ్రీ కళాశాల, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ మరియు కల్వకుర్తి ఎత్తిపోతల, డిండి ప్రాజెక్టు అభివృద్ధి ద్వారా, లింక్ కెనాల్ ద్వారా, చాలా చెరువులు కుంటలు నిండి గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకు సాగునీరు అందే అవకాశం ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి చోల్లోటి భాస్కరాచారి, రిటైడు ఉద్యోగుల సంఘం అధ్యక్షులు అంకం చంద్రమౌళి, ముదిరాజ్ సంఘం పట్టణ అధ్యక్షులు రాసమల్ల నాగయ్య ముదిరాజ్, కూరెళ్ళ కృష్ణమాచారి,సయ్యద్ అజ్మతుల్ల (పాషా భాయ్),ముసిని సత్యం,బాబు రాం నాయక్ , ముదిరాజ్ పట్టణ అధ్యక్షులు తూటుపల్లి శ్రీను, గౌరోజు బ్రహ్మచారి,వనం బుచ్చయ్య,వనం శ్రీనివాసులు,గిరి ,పున్న మల్లేష్,ముసిని వీరయ్య, బీసీ మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు ఎస్.కె అబ్దుల్ కలాం తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img