Homeహైదరాబాద్latest NewsBREAKING: దేవెగౌడ మనవాడి రాసలీలలు.. బయటపడిన వెయ్యికిపైగా వీడియోలు

BREAKING: దేవెగౌడ మనవాడి రాసలీలలు.. బయటపడిన వెయ్యికిపైగా వీడియోలు

కర్ణాటక రాజకీయాల్లో లోక్ సభ ఎన్నికల వేళ అశ్లీల వీడియోల కలకలం రేగింది. మాజీ ప్రధాని, జేడీఎస్‌ అగ్రనేత దేవెగౌడ మనువడి రాసలీలలు దేశ వ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. మాజీ సీఎం కుమార స్వామి సోదరుడి కుమారుడు, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన పోలీసుల విచారణలో వెయ్యికిపైగా అమ్మాయిలతో శృంగారంలో పాల్గొన్న వీడియోలు బయటపడ్డాయి.

మహిళలతో అతను అసభ్యగా ప్రవర్తిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హసన్ జిల్లాలో పలువురు మహిళను లైంగికంగా వేధించారంటూ ఆ వీడియోల్లో ఆరోపించారు. వైరల్ అవుతున్న వీడియోలు ప్రజ్వల్ డూప్​తో చిత్రీకరించినవి, మార్ఫింగ్ చేసినవని ఆరోపిస్తూ హొలెనరసాపూర్ పోలీస్ స్టేషన్​లో ప్రజ్వల్ తరఫున ఫిర్యాదు దాఖలైంది. తన ప్రతిష్టను దిగజార్చేందుకు మార్ఫింగ్ చేసిన వీడియోలు వైరల్ చేస్తున్నారని అందులో పేర్కొన్నారు.

మహిళలను లైంగికంగా వేధించి, అసభ్యంగా ప్రవర్తించిన ప్రజ్వల్​ను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తూ కాంగ్రెస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో బెంగళూరులో నిరసన చేపట్టారు. ఆయన దిష్టిబొమ్మను తగులబెట్టారు. అలాగే ఈ స్కాండల్​పై విచారణ జరిపించాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నాగలక్ష్మి చౌదరి సీఎంకు లేఖ రాశారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర సీఐడీ అడిషనల్​​ డైరెక్టర్ జనరల్ బిజయ్ సింగ్ సారథ్యంలో సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం సిద్ధరామయ్య ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. దీంతో ప్రజ్వల్ దేశం విడిచి జర్మనీలోని ఫ్రాంక్​ఫర్ట్​కు వెళ్లారు.

Recent

- Advertisment -spot_img