Homeఫ్లాష్ ఫ్లాష్సైన్స్‌ ద్వారానే సమాజ అభివృద్ధి

సైన్స్‌ ద్వారానే సమాజ అభివృద్ధి

– లక్షెట్టిపేట ఎస్సై లక్ష్మణ్‌
– ట్రీనిటీ హై స్కూల్‌లో సైన్స్‌ ఫెయిర్‌ ప్రారంభం

ఇదేనిజం, లక్షెట్టిపేట : అభివృద్ధికి ఆధారమే సైన్స్‌ అని, సైన్స్‌ ద్వారానే ఆధునిక మానవుని జీవన మనుగడ సాధ్యమవుతుందని లక్షెట్టిపేట ఎస్సై లక్ష్మణ్‌ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని ట్రీనిటీ హై స్కూల్‌లో సైన్స్‌ ఫెయిర్‌ కు ముఖ్య అతిథిగా అయన హాజరయ్యారు. అంతకుముందు సైన్స్‌ ఫెయిర్‌ను రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ వందలాది మంది విద్యార్థులు ఈ సైన్స్‌ ఫెయిర్‌లో పాల్గొనడం చాలా అభినందనీయమన్నారు. ప్రతీ విద్యార్థి తమ పరిశోధనల ద్వారా మానవాళి అభివృద్ధికి పాటుపడేలా కష్టపడాలన్నారు. అవకాశాలను అందిపుచ్చుకొని గొప్ప స్థాయికి ఎదగాలన్నారు. అత్యంత పేద కుటుంబంలో పుట్టి చాలా కష్టపడి చదువుకుని, మిస్సైల్‌ మ్యాన్‌గా ఎదిగి, ఆ తర్వాత ఈ దేశానికి రాష్ట్రపతి అయిన డాక్టర్‌ ఏపీజె అబ్దుల్‌ కలాం మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. పట్టణంలో సైన్స్‌ ఫెయిర్‌ నిర్వహించడం చాలా గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ ఏవీ జోసెఫ్‌, డైరెక్టర్‌ డోన్‌ డొమినిక్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ బ్రో రాహుల్‌, సతీష్‌, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img