HomeSocial Mediaఐనవోలుకు పోటెత్తారు..

ఐనవోలుకు పోటెత్తారు..

ఐనవోలు మల్లన్న జాతరకు భక్తుల పోటెత్తారు. భోగి పర్వదినం, మళ్లీ ఈ రోజు సండే కావడంతో స్వామి వారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ రోజు పొద్దున నుంచే భక్తులు దర్శనం కోసం క్యూలో వేచి ఉన్నారు. స్వామి వారి దర్శనానికి 4గంటలకు పైగా సమయం పడుతోంది. శ్రీ మల్లికార్జున స్వామిని కుటుంబ సమేతంగా మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ దర్శించుకునేందుకు వచ్చారు.

హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లన్న జాతర నిన్న ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ భోగి, రేపు (15న) సంక్రాంతి, 16న కనుమ పండుగ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తర తెలంగాణ ప్రజలు కొంగుబంగారంగా కొలిచే అయిలోని మల్లన్న ఉత్సవాలకు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి దాదాపు 10 లక్షల మంది తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఐనవోలు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు సంక్రాంతి నుంచి ప్రారంభమై ఉగాది వరకు కొనసాగుతాయి. అధికారులతో పాటు ఆలయ కమిటీ కూడా భక్తుల రాకపోకలకు తగ్గట్టుగా చర్యలు తీసుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా పకడ్బందీ ఏర్పాటు పూర్తీ చేశారు.

Recent

- Advertisment -spot_img