Homeహైదరాబాద్latest Newsఅత్యవసర సమయంలో రక్తదానం చేసిన ధర్మపురి వాసి

అత్యవసర సమయంలో రక్తదానం చేసిన ధర్మపురి వాసి

ఇదే నిజం, ధర్మపురి రూరల్: గోదావరిఖని కి సంబందించిన సత్యమ్మ రక్తకణాలు తక్కువ అయి జగిత్యాల లోని ఆరోగ్య ఆసుపత్రి లో చేరడం జరిగింది. ఆమెను పరీక్ష చేసిన వైద్యులు (Ab+) రక్తకణాలు అవసరం అని చెప్పారు. దాంతో ఆదివారం రోజు అర్థరాత్రి సమయంలో ఆపదలో ఉన్న ఆమెకు ధర్మపురి పట్టణానికి చెందిన సయ్యద్ సల్మాన్ రక్తకణాలు ఇవ్వడం జరిగింది. అత్యవసర సమయంలో సహాయం చేసిన సల్మాన్ కు సత్యమ్మ , స్థానికులు మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ రషీద్ , ఖిజార్ , తదితరులు పాల్గోన్నారు.

Recent

- Advertisment -spot_img