ఇదే నిజం, ధర్మపురి టౌన్ : జగిత్యాల జిల్లా ధర్మపురి (Dharmapuri) మున్సిపాలిటీలో పనిచేసే సిబ్బందికి మరియు పారిశుద్ధ్య కార్మికులకు కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు జక్కు పద్మ రవీందర్,సంఘనబట్ల సంతోషి దినేష్,వేముల నాగలక్ష్మి రాజేష్,గరిగే అరుణ రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బంది మరియు పారిశుద్ధ్య కార్మికులను శాలువాతో సన్మానించి వారికి బట్టలు చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాల సంతోషంగా ఉందని,పట్టణాన్ని పరిశుభ్రంగా వుంచడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకమని, ధర్మపురి మున్సిపాలిటీలో ఇటీవల సీసీ రోడ్లు,డ్రైనేజీల నిర్మాణానికి టీయుఎఫ్ఐడిసి గ్రాంట్ కింద 15 కోట్ల రూపాయలను మంజూరు చేసి వాటికి శంకుస్థాపనలు చెసుకోవడం జరిగిందని, వీలైనంత త్వరగా అట్టి పనులను పూర్తి చేయాలనీ అధికారులను కూడా ఆదేశించడం జరిగిందని, వచ్చే వేసవిలో తాగునీటి సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని, గత ప్రభుత్వ పాలకుల అనాలోచిత నిర్ణయాల వల్ల ధర్మపురి తలపున గోదావరి ఉన్న ఇక్కడి ప్రాంత ప్రజలు త్రాగు నీటి విషయంలో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందనీ, ఎస్ డి ఎఫ్ గ్రాంట్ కింద 10 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే అందులో 6 కోట్ల రూపాయలను కేవలం బోర్ వెల్స్ కే కేటాయించడం జరిగిందని తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాబోయే రోజుల్లో నియోజకవర్గానికి సంబంధించి మంచినీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా అదే విధంగా ధర్మపురి మున్సిపల్ పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, సంఘనభట్ల దినేష్, వేముల రాజేష్, జక్కు రవీందర్, సిబ్బంది, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.