Homeసినిమాథ్రిల్లింగ్ ఎలిమెంట్స్​తో రాబోతున్న‘దూత’

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్​తో రాబోతున్న‘దూత’

నాగ చైతన్య మెయిన్ లీడ్​లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ వెబ్​ సిరీస్ ‘దూత’. అమెజాన్​ ప్రైమ్ దీన్ని నిర్మిస్తుండగా.. నాగచైతన్య నటిస్తున్న మొదటి వెబ్​ సిరీస్​ ఇదే. క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్​ కె కుమార్ డైరెక్షన్​లో వస్తున్న ఈ వెబ్​ సిరీస్​పై మంచి అంచనాలున్నాయి. అయితే, చైతూ బర్త్​ డే సందర్భంగా గురువారం దూత ట్రైలర్​ను మేకర్స్ రిలీజ్ చేశారు. చైతూ ఓ న్యూస్ జర్నలిస్ట్ గా కనిపిస్తుండగా.. తనకి సంబంధం లేని ఓ క్రైమ్​లో ఇరుక్కున్నట్లుగా కనిపిస్తున్నది. అలాగే దర్శకుడు విక్రమ్ కె కుమార్ చూపించిన సస్పెన్స్ ఫ్యాక్టర్ మంచి థ్రిల్లింగ్​గా అనిపిస్తుంది. ఈ ట్రైలర్ మంచి ప్రామిసింగ్​గా ఉందనే చెప్పాలి. ఈ వెబ్​ సిరీస్​ డిసెంబర్ 1న ప్రైమ్​ వీడియోలో పాన్​ ఇండియా లాంగ్వేజెస్​లో స్ట్రీమింగ్ కానుంది.

Recent

- Advertisment -spot_img