Homeహైదరాబాద్latest Newsఆర్టీసీ మియాపూర్-2 డిపోలో డయల్ యువర్ డీఎం కార్యక్రమం..

ఆర్టీసీ మియాపూర్-2 డిపోలో డయల్ యువర్ డీఎం కార్యక్రమం..

ఇదేనిజం,శేరిలింగంపల్లి: ఆర్టీసీ మియాపూర్-2 డిపోలో నేడు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుందని డిపో మేనేజర్ వెంకటేశం ఒక ప్రకటనలో తెలిపారు. డిపో పరిధిలోని మియాపూర్, బాచుపల్లి, మల్లంపేట్ తో పాటుగా నిజాంపేట్ పరిసర ప్రాంతాల ప్రజలు ఆర్టీసీ బస్సు సర్వీస్ సేవలకు సంబంధించి తమ సమస్యలతో పాటుగా సూచనలు, సలహాలు తెలిపేందుకు గాను డయల్ యువర్ డిఎం కార్యక్రమం దోహదపడుతుందని డిపో మేనేజర్ సూచించారు. ఈ నెల 30న మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు 9959226420 ఫోన్ నెంబర్లు సంప్రదించవచ్చని డిపో మేనేజర్ వెంకటేశం వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పౌరులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

Recent

- Advertisment -spot_img