Homeఎడిటోరియల్​Court Writs : ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన రిట్లు, వాటి అర్థం, ఉద్దేశం

Court Writs : ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన రిట్లు, వాటి అర్థం, ఉద్దేశం

Court Writs : ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన రిట్లు, వాటి అర్థం, ఉద్దేశం

Court Writs : వ్యక్తులు తమ ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లిందని భావిస్తే వారు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. ఆర్టికల్, 32 ప్రకారం సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల సంరక్షణ కోసం 5 రకాల రిట్లు జారీచేస్తుంది. అవి

హెబియస్‌ కార్పస్‌ – బందీని ప్రత్యక్షపర్చడం.

ఉద్దేశం– వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షణ

హెబియస్‌ అంటే Have  అని, కార్పస్‌ అంటే Body అని అర్థం. అంటే ఒక వ్యక్తిని భౌతికంగా కోర్టు ముందు హాజరుపర్చడం.

ఆర్టికల్ 19 నుంచి 22 వరకు పొందుపర్చిన వ్యక్తిగత స్వేచ్ఛలకు భంగం కలిగినప్పుడు ఈ రిట్‌ను జారీ చేస్తారు.

అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల్లోగా సమీప న్యాయస్థానంలో హాజరుపర్చకపోతే ఈ రిట్‌ దాఖలు చేస్తే వెంటనే ఆ వ్యక్తిని న్యాయస్థానం ముందు హాజరుపర్చాలని కోర్టు ఆదేశిస్తుంది.

ఈ రిట్‌ ప్రధాన ఉద్దేశం వ్యక్తిగత స్వేచ్ఛ పరిరక్షణ, చట్ట వ్యతిరేకంగా ఏ వ్యక్తినీ నిర్బంధించకుండా, శిక్షించకుండా కాపాడటం.

ప్రభుత్వ సంస్థలకు, ప్రైవేటు వ్యక్తులకు కూడా ఈ రిట్ ను జారీ చేయొచ్చు.

మూడో వ్యక్తి కూడా ఇందులో జోక్యం చేసుకొనే హక్కు ఉంటుంది.

మాండమస్‌ – మేం ఆదేశిస్తున్నాం

ఉద్దేశం– ప్రభుత్వ అధికారులతో వారి విధులను నిర్వర్తింపజేయడం

మాండమస్‌ అంటే ఆదేశం అని అర్థం.

సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జారీ చేసే అత్యున్నత ఆదేశమిది.

ప్రభుత్వాధికారి లేదా సంస్థ తన చట్టబద్ధ విధులను నిర్వర్తించనప్పుడు ప్రజల హక్కులకు భంగం కలుగుతుంది.

అలాంటి సందర్భాల్లో ఆ విధులను నిర్వర్తించాలని న్యాయస్థానం ఈ రిట్‌ను జారీ చేస్తుంది.

దీన్ని పబ్లిక్, క్వాజీ పబ్లిక్, జ్యుడీషియల్, క్వాజి జ్యుడీషియల్‌ సంస్థలకు వ్యతిరేకంగా జారీ చేయొచ్చు.

రాష్ట్రపతి, గవర్నర్లకు ఈ రిట్‌ వర్తించదు.

ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు సంస్థలకు వ్యతిరేకంగా జారీ చేయడానికి వీల్లేదు.

పాలనపరంగా ఉన్న ప్రత్యామ్నాయాల ద్వారా పౌరులు న్యాయాన్ని పొందలేనప్పుడు ఈ రిట్‌ ద్వారా ఉపశమనం పొందొచ్చు. కాబట్టి ఈ రిట్‌ జారీ కోర్టు విచక్షణపై ఆధారపడి ఉంటుంది.

బాధితుల తరఫున సామాజిక స్పృహ ఉన్న సంస్థ లేదా వ్యక్తి ఈ రిట్‌ దాఖలు చేయొచ్చు. అందుకే దీన్ని ఉదారమైన రిట్‌ అంటారు. వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షణ సాధనం అని కూడా అంటారు.

పార్లమెంటు స్వాధికారాలకు భంగం కలిగించిన కారణంగా వ్యక్తిని నిర్బంధించినప్పుడు, కోర్టు ద్వారా నేరారోపణ రుజువై, ఖైదీగా శిక్షను అనుభవిస్తున్నప్పుడు ఇది వర్తించదు.

ప్రొహిబిషన్‌ – నిషేధం

ఉద్దేశం– దిగువ కోర్టులు తమ పరిధులను అతిక్రమించకుండా నియంత్రించడం

ప్రొహిబిషన్‌ అంటే నిషేధించడం అని అర్థం.

ఏదైనా దిగువ కోర్టు లేదా ట్రిబ్యునల్‌ తన పరిధిని దాటి కేసును విచారిస్తున్నప్పుడు ఆ విచారణను తదుపరి ఆదేశాల వరకు నిలిపివేయాలని కోర్టు ఆదేశిస్తుంది.

కింది కోర్టులు తమ పరిధిని దాటకుండా నిరోధించడమే ఈ రిట్‌ ఉద్దేశం.

న్యాయ సంస్థలకే ఇది వర్తిస్తుంది. పాలనా, చట్టపరమైన సంస్థలకు వర్తించదు.

కేసు ప్రారంభ దశలో ఉంటే ప్రొహిబిషన్‌ రిట్, తీర్పు వెలువడిన తర్వాత సెర్షియోరరి రిట్‌ జారీ చేస్తారు.

ప్రొహిబిషన్‌ రిట్‌ కేవలం నిలుపుదల చేస్తుంది.

సెర్షియోరరీ – సుపీరియర్‌ లేదా టు సర్టిఫై

ఉద్దేశం – ఇది కూడా దిగువ కోర్టులను నియంత్రించడమే. అయితే తీర్పునకు మందయితే ప్రొహిబిషన్‌ జారీ చేస్తారు. తీర్పు తరువాతయితే షెర్షియోరరీని జారీచేస్తారు.

సెర్షియోరరి అంటే సుపీరియర్‌ లేదా టు బి సర్టిఫైడ్‌ లేదా బ్రింగ్‌ ద రికార్డ్స్‌ అని అర్థం.

ఏదైనా కింది కోర్టు తన పరిధిని అతిక్రమించి కేసును విచారించి తీర్పు చెప్పినప్పుడు ఆ తీర్పును రద్దుచేసి కేసును పై కోర్టుకు బదిలీ చేయాలని ఇచ్చే ఆదేశం ఇది.

ఈ రిట్‌ ఉద్దేశం కూడా కింది కోర్టులు తమ పరిధులను అతిక్రమించకుండా నిరోధించడం.

ప్రైవేటు, శాసన సంస్థలకు వ్యతిరేకంగా దీన్ని జారీ చేసే వీల్లేదు.

ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్న పాలనా సంస్థలకు వ్యతిరేకంగా జారీ చేయొచ్చని ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఎన్విరాన్‌–లీగల్‌ యాక్షన్‌ V/టయూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

కేసు ప్రారంభ దశలో ఉంటే ప్రొహిబిషన్‌ రిట్, తీర్పు వెలువడిన తర్వాత సెర్షియోరరి రిట్‌ జారీ చేస్తారు.

సెర్షియోరరి రిట్‌ దిగువ కోర్టులను నియంత్రించడమే కాకుండా అవి చేసిన తప్పిదాలను కూడా సవరిస్తుంది.

కోవారెంటో – ఏ అధికారంతో

ఉద్దేశం – ప్రజా పదవిలోకి అక్రమంగా ప్రవేశించకుండా నియంత్రించడం. అలాగే ప్రజాపదవులను దుర్వినియోగం కాకుండా కాపాడటం.

కోవారంటోను బై వాట్‌ వారంట్‌ అంటారు. కోవారంటో అంటే ఏ అధికారం ద్వారా అని ప్రశ్నించడం.

ప్రజా సంబంధ పదవుల్లోకి అక్రమంగా ప్రవేశించినా లేదా ప్రజా పదవులను దుర్వినియోగపర్చినా, పదవిలో ఉన్న వ్యక్తి తాను ఆ పదవిలో కొనసాగడానికి చట్టబద్ధంగా ఉన్న అధికారాన్ని న్యాయస్థానాలు ప్రశ్నిస్తాయి.

చట్టబద్ధత లేకపోతే పదవి నుంచి వెంటనే తప్పుకోవాలని ఆదేశిస్తాయి.

ప్రజా పదవుల దుర్వినియోగాన్ని అరికట్టడం ఈ రిట్‌ ప్రధాన ఉద్దేశం.

ప్రజా పదవి అంటే చట్టం ద్వారా ఏర్పాటైన స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థలో పదవి. అంటే ప్రభుత్వ కార్పొరేషన్‌ చైర్మన్లు, డైరెక్టర్లు, మంత్రులు, ముఖ్యమంత్రులు మొదలైనవారు.

ఈ రిట్‌ విషయంలో బాధితులు మాత్రమే కోర్టులను ఆశ్రయించాలని రూల్ని లేదు.

ప్రజా పదవులను దుర్వినియోగం నుంచి కాపాడాలనే పౌరుడు ఎవరైనా కోర్టును ఆశ్రయించవచ్చు. మూడో వ్యక్తి కూడా ఇందులో జోక్యం చేసుకునే హక్కు ఉంటుంది.

ఇన్‌జంక్షన్‌ (Court Writs)

రాజ్యాంగంలో ఈ రిట్‌ గురించి లేదు.

సివిల్‌ వివాదాల్లో యథాతథా స్థితిని కొనసాగించడానికి దీన్ని జారీ చేస్తారు.

భర్తీ చేయడానికి వీల్లేని నష్టాన్ని అరికట్టేందుకు ఇన్‌జంక్షన్‌ను జారీ చేస్తారు.

కాబట్టి ప్రాథమిక హక్కుల పరిరక్షణకు, ఈ రిట్‌కు సంబంధం లేదు.

ముఖ్యమైన కేసులు (Court Writs)

చెంపకం దొరైరాజన్‌ వర్సెస్‌ మద్రాస్‌, 1950-మతపరమైన రిజర్వేషన్‌లు చెల్లవు.

ఏకే గోపాలన్‌ వర్సెస్‌ తమిళనాడు, 1950-అక్రమ అరెస్టుల నివారణ నిర్బంధ చట్టం

శంకరీ ప్రసాద్‌ వర్సెస్‌ ఇండియా, 1951-న్యాయసమీక్ష అధికారాన్ని మొదటిసారిగా వినియోగించారు.

గోలక్‌నాథ్‌ వర్సెస్‌ పంజాబ్‌, 1967-ప్రాథమిక హక్కులు, మౌలిక నిర్మాణం సవరణకు అతీతం.

కేశవానంద భారతి వర్సెస్‌ కేరళ, 1973-పార్లమెంటుకు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం ఉంది.

మేనకాగాంధీ వర్సెస్‌ ఇండియా, 1978-సంచార స్వేచ్ఛ, విదేశాలకు వెళ్లేహక్కు.

ఇందిరా సహాని వర్సెస్‌ ఇండియా (మండల్‌ కేసు), 1992-ఓబీసీలకు రిజర్వేషన్‌కు సంబంధించింది.

ఉన్నికృష్ణన్‌ వర్సెస్‌ ఆంధ్రప్రదేశ్‌, 1993-విద్యాహక్కు, జీవించే హక్కులో అంతర్భాగం.

ఎస్‌ఆర్‌ బొమ్మై వర్సెస్‌ ఇండియా, 1994-లౌకికత్వం రాజ్యాంగ ప్రవేశికలో అంతర్భాగం.

విశాఖ వర్సెస్‌ రాజస్థాన్‌, 2007-పని ప్రదేశాల్లో స్త్రీల పట్ల లైంగిక వేధింపులు, సమానత్వ హక్కును ఉల్లంఘిస్తుంది.

అరుణా షాన్‌బాగ్‌ వర్సెస్‌ ఇండియా, 2011-కారుణ్య మరణం తిరస్కరించింది.

సరళ ముద్గళ్‌ కేసు-1995 యూనిఫామ్‌, సివిల్‌కోడ్‌కు సంబంధించింది.

బిజో ఇమ్మాన్యుయేల్‌ వర్సెస్‌ కేరళ, 1986-జాతీయ గీతానికి సంబంధించింది.

Recent

- Advertisment -spot_img