Homeహైదరాబాద్latest Newsఆటోలే అంబులెన్స్ లు గాలిలో డిండి ప్రజల ప్రాణాలు

ఆటోలే అంబులెన్స్ లు గాలిలో డిండి ప్రజల ప్రాణాలు

ఇదే నిజం, దేవరకొండ : డిండి మండల కేంద్రం అయినప్పటికీ కనీస వైద్య సదుపాయాలు లేవని డిండి బీజేపి టౌన్ ప్రెసిడెంట్ గాయాల రాఘవేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఆరోగ్య సమస్య వచ్చినా కల్వకుర్తి, అచ్చంపేట వరకు తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. సమయానికి తెలిసిన వారి కార్ లు, వాహనాలు లేనప్పుడు ఆటోలో తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. దీంతో వైద్యం అందించడం లో అత్యంత కీలకమైన సమయం దాదాపు గంటన్నర వృథా అవుతుంది. పెద్ద ఆసుపత్రి వైద్యులు కూడా ఎటువంటి సహాయం చేయలేక పోతున్నారు. ఇంత దీనమైన పరిస్థితి మండల ప్రజలకు ఎందుకు? ఎన్ని ప్రభుత్వాలు మారినా మన బతుకులు మారడం లేదని కనీసం ఇప్పటి ప్రభుత్వం, ఎమ్మెల్యే చొరవ తీసుకొని 24 గంటల అంబులెన్స్ సౌకర్యం ఇవ్వాలని కోరుతున్నామన్నారు.

Recent

- Advertisment -spot_img