Homeఅంతర్జాతీయంDinosaur Egg : భద్రపరిచిన డైనోసార్ పిండాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు

Dinosaur Egg : భద్రపరిచిన డైనోసార్ పిండాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు

Dinosaur Egg : సురక్షితంగా భద్రపరిచిన డైనోసార్ పిండాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు

Dinosaur Egg : అత్యంత సురక్షిత పరిస్థితుల్లో భద్రపరిచిన డైనోసార్ పిండాన్ని కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు.

కోడిపిల్ల మాదిరిగానే ఇది కూడా గుడ్డు నుంచి పొదగడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

దక్షిణ చైనాలోని గ్వాంజౌలో ఈ పిండం లభ్యమైంది. దీని వయస్సు కనీసం 66 మిలియన్ సంవత్సరాలు ఉంటుందని పరిశోధకులు అంచనా వేశారు.

ఇది దంతాలు ఉండని ‘థైరోపాడ్ డైనోసార్’ లేదా ‘ఓవిరాప్టోరోసార్’ అని నమ్ముతున్నారు. దీనికి బేబీ ఇంగ్లియాంగ్ అని పేరు పెట్టారు.

”చరిత్రలో ఇప్పటివరకు కనిపెట్టిన వాటిలో ఇదే అత్యుత్తమ డైనోసార్ పిండం” అని పరిశోధకులు డాక్టర్ ఫియాన్ వైసుమ్ మా అన్నారు.

డైనోసార్లకు, ఆధునిక పక్షులకు మధ్య ఉన్న సంబంధం గురించి పరిశోధకులకు మరింత అవగాహన కలిగేలా ఈ ఆవిష్కరణ దోహదపడింది.

Never Search In Google: గూగుల్‌లో సెర్చ్ చేయ‌కూడ‌ని ప‌దాలు..

Nobel Prize : నోబెల్​ పొందిన భారతీయులు.. 2021 నొబెల్​ విజేతలు

‘టకింగ్’ అని పిలవబడే స్థితిలో ఈ పిండం ఉన్నట్లు బయల్పడిన శిలాజం ఆధారంగా తెలుస్తోంది.

సాధారణంగా ఆధునిక పక్షులు పొదగడానికి కొంతకాలం ముందు వంకరగా ఇలా టకింగ్ స్థితిలో ఉంటాయి.

”ఆధునిక పక్షుల్లో కనిపించే ఈ ప్రవర్తన, వాటికి తమ పూర్వీకులైన డైనోసార్ల నుంచి వచ్చినట్లు తాజా ఆవిష్కరణ సూచిస్తుంది” అని ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీతో డాక్టర్ మా చెప్పారు.

ఓవిరాప్టోరోసార్ అంటే రెక్కలతో ఉండే డైనోసార్లు.

ఇవి 100 మిలియన్ నుంచి 66 మిలియన్ సంవత్సరాల క్రితం క్రెటాసియస్ చివరి కాలంలో ప్రస్తుతం ఆసియా, ఉత్తర అమెరికాలుగా ఉన్న ప్రాంతాల్లో నివసించేవి.

”ఇప్పటివరకు నేను చూసిన డైనోసార్ శిలాజాల్లో అత్యంత అద్భుతమైన శిలాజం ఇదే.

ఈ శిలాజంలోని పిండం పొదిగి జీవిగా మారేందుకు సిద్ధంగా ఉంది” అని పరిశోధనా బృందంలో ఒకరైన పురాణ జంతుశాస్త్రం ప్రొఫెసర్ స్టీవ్ బ్రుసాట్ ట్వీట్ చేశారు.

Dangerous Mobile Apps : మీ మొబైల్​లో ఈ యాప్స్​ ఉన్నాయా..

Sim Cards Block : మీ పేరు మీద ఎక్కువ‌ సిమ్ కార్డ్స్ ఉన్నాయా..

తల నుంచి తోక వరకు ఈ బేబీ ఇంగ్లియాంగ్ 10.6 అంగుళాల పొడవుంది.

చైనాలోని ఇంగ్లియాంగ్ స్టోన్ నేచర్ హిస్టరీ మ్యూజియంలోని గుడ్డులో ఉన్న డైనోసార్ పొడవు 6.7 అంగుళాలు.

2000లో తొలిసారిగా ఆ డైనోసార్ గుడ్డును కనుగొన్నారు. దాన్ని 10 ఏళ్ల పాటు నిల్వచేశారు.

మ్యూజియంలో నిర్మాణ పనుల కారణంగా పాత శిలాజాలను క్రమబద్దీకరిస్తున్న సమయంలో పరిశోధకుల దృష్టి అక్కడున్న గుడ్డుపై పడింది.

దాన్ని పరిశీలించిన పరిశోధకులు అందులో పిండం ఉండొచ్చని అనుమానించారు.

డైనోసార్ శరీరంలోని కొంతభాగం ఇంకా రాతితోనే కప్పబడి ఉంది.

దాని అస్థిపంజరం పూర్తి చిత్రాన్ని రూపొందించడానికి పరిశోధకులు అధునాతన స్కానింగ్ పద్ధతులను ఉపయోగించనున్నారు.

Painless Death : సూసైడ్‌ మెషీన్‌.. నొప్పిలేకుండా నిమిషంలోనే చావు

Apply New PAN Card : పాన్ కార్డ్ అప్లైకి బెస్ట్​ సైట్ ఏది.. స్టెప్​ బై స్టెప్​ ప్రాసెస్​

Recent

- Advertisment -spot_img