Homeసైన్స్​ & టెక్నాలజీNever Search In Google: గూగుల్‌లో సెర్చ్ చేయ‌కూడ‌ని ప‌దాలు..

Never Search In Google: గూగుల్‌లో సెర్చ్ చేయ‌కూడ‌ని ప‌దాలు..

Never Search In Google: గూగుల్‌లో సెర్చ్ చేయ‌కూడ‌ని ప‌దాలు..

Never Search In Google: గూగుల్ లో మనం ప్రతీ విషయాన్ని వెతుకుతుంటాం.

కానీ గుగుల్ లో ఏదైనా వెతికే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.. గూగుల్ లో అస్సలు వెతకకూండా ఉండే పదాలు చాలా ఉన్నాయి. వాటిని ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్. ప్రస్తుతం ప్రతీ ఒక్కరికీ పరిచయమైన పదం. ఈ గూగుల్ అంటే తెలియని వారు దాదాపు ఉండకపోవచ్చు.

మనకు తెలియని ప్రతీ ప్రశ్నకు జవాబును తెలియజేస్తుంది. ప్రపంచాన్ని మన కళ్ల ముందు ఉంచుతుంది.

ఇలా అడ్ర‌స్ వెత‌క‌డం నుంచి ఆన్‌లైన్ బ్యాంకింగ్ వ‌ర‌కు ఏ విష‌యం కావాల‌న్నా ముందుగా సెర్చ్ చేసేది గూగుల్‌లోనే.. అంత‌లా మ‌నం గూగుల్‌కు అల‌వాటు ప‌డిపోయాం.

అయితే గూగుల్ సెర్చ్‌ ‌లో దొరికే స‌మాచారం అంతా నిజ‌మేనా.. అంటే కాద‌నే చెప్పాలి..

Dog Saved Baby : తల్లి వదిలేసిన శిశువుకు తల్లిగా మారిన శునకం.. తన పిల్లలతో పాటే ఉంచుకుని..

Gender Ratio in India : దేశంలో పురుషులను దాటిన మహిళా జనాభా

కొన్ని విష‌యాలు గూగుల్‌లో వెతికిదే ప‌ర్లేదు.. కానీ బ్యాంకింగ్‌, క‌స్ట‌మ‌ర్ కేర్ నంబ‌ర్లు వంటివి కొన్ని వివ‌రాల‌ను గూగుల్‌లో సెర్చ్ చేసేట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా ఉండాలి.

ఇంకా చెప్పాలంటే అలాంటి వాటి గురించి వెత‌క్క‌పోవ‌డ‌మే మంచిది.

లేదా సైబర్ నేర‌గాళ్ల వ‌ల‌లో ప‌డే ప్ర‌మాదం ఉంటుంది.

అయితే గూగుల్ లో ఎలాంటి సమాచారం వెతకాలి.. ఎలాంటివి వెతకకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయుధాల తయారీ, ఆత్మహత్య, హత్య, చైల్డ్ పోర్నోగ్ర‌ఫీ అనే పదాలను గూగుల్ లో వెతకొద్దు.

ఎందుకంటే ఇలాంటి పదాలు వెతికేటప్పడు ఐపీ అడ్రస్ ను ట్రేస్ చేసి మీపై నిఘా పెట్టే అవకాశం ఉంటుంది.

కొంత‌మంది అనారోగ్యానికి గురైన‌ప్పుడు గూగుల్‌లో వెతికి సొంత వైద్యం చేస్తుంటారు.

కానీ గూగుల్‌లో దొరికే ప్ర‌తి స‌మాచారం క‌రెక్టేన‌ని న‌మ్మ‌కం లేదు.

కాబ‌ట్టి ఏదైనా సమస్య ఉంటే డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

Asthma : ఆస్తమా లేక ఉబ్బసం ఎందుకొస్తుంది.. రాకుండా ఏం చేయాలి..

Proteins For Body : మీ శరీరానికి ఎన్ని ప్రోటీన్లు కావాలో లెక్కగట్టండి ఇలా..

కస్టమర్ కేర్ల నంబర్లు ఎట్టి పరిస్థితుల్లో గూగుల్ లో సెర్చ్ చేయకూడదు.

కావాలంటే సదరు కంపెనీ వెబ్ సైట్ కి వెళ్లి సమాచారాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది.

కానీ ఇలా గూగుల్ లో వెతకడం ద్వారా సైబర్ నేరగాళ్ల వలలో పడే అవకాశం ఉంటుంది.

బ్యాంకింగ్ వెబ్ సైట్లను వెతికేటప్పడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెబ్‌సైట్ యూఆర్ఎల్‌ను గూగుల్‌లో వెతకకూడదు.

ముఖ్యంగా ఆన్‌లైన్ బ్యాంకింగ్ వెబ్‌సైట్ల విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాలి.

పొర‌పాటున న‌కిలీ వెబ్‌సైట్ ఓపెన్ చేసి మ‌న లాగిన్ వివ‌రాలు ఎంట‌ర్ చేశామంటే ఇక అంతే సంగ‌తులు.

ఏదైనా యాప్ లేదా సాఫ్ట్‌వేర్లు కావాలంటే చాలామంది గూగుల్‌లో వెతికి ఇన్‌స్టాల్ చేసుకుంటుంటారు.

Food For Brain Health : ఈ ఫుడ్​ తింటే మెదడుకు సమస్యలే

Startup Investments : మీ స్టార్ట‌ప్‌కు పెట్టుబ‌డి కావాలా.. వీరు పెడ‌తారంటా..

అవి ఏపీకే ఫైల్ లాగా డౌన్ లోడ్ చేస్తాం. ఇలాంటివి సురక్షితంగా ఉండకపోవచ్చు.

ఏదైనా యాప్ లేదా సాఫ్ట్ వేర్ కావాలంటే ఆండ్రాయిడ్ ప్లే స్టోర్‌, యాపిల్ స్టోర్ లేదా మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి మాత్ర‌మే డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

సోష‌ల్ మీడియా వెబ్‌సైట్ల యూఆర్ఎల్‌ను కూడా గూగుల్‌లో వెత‌కొద్దు.

పొర‌పాటున‌ న‌కిలీ వెబ్‌సైట్‌లో లాగిన్ అయితే మ‌న వ్య‌క్తిగత వివ‌రాలు మొత్తం సైబ‌ర్ నేర‌గాళ్ల చేతిలోకి వెళ్లిపోతాయి.

పేరు, ఫోన్ నంబ‌ర్, అడ్ర‌స్‌, మెయిల్ ఐడీ వంటి వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను గూగుల్ లో సెర్చ్ చేస్తుంటారు.

ఇలా మ‌నం సెర్చ్ చేసే ప్ర‌తి విష‌యాన్ని గూగుల్ స్టోర్ చేసుకుంటుంది.

ఇలా స్టోర్ అయినా డేటా సైబ‌ర్ నేరగాళ్ల చేతిలో ప‌డితే మాత్రం చిక్కుల్లో ప‌డిపోతాం.

అందుకే వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను గూగుల్‌లో సెర్చ్ చేయ‌వ‌ద్దు.

ఇవేకాకుండా కొన్ని ఫైనాన్స్, స్టాక్ మార్కెట్, ప్రభుత్వ వెబ్ సైట్ల విషయంలో కూడా కచ్చితంగా తెలిస్తేనే గూగుల్ లో యూఆర్ ఎల్ తో చెక్ చేయాలి.

లేదంటే ప్రమాదం పొంచి ఉన్నట్లు గమనించండి.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img