Homeఅంతర్జాతీయంDisease X : ప్రపంచ దేశాలకు మరో వైరస్ ముప్పు

Disease X : ప్రపంచ దేశాలకు మరో వైరస్ ముప్పు

Disease X : ప్రపంచ దేశాలకు మరో వైరస్ ముప్పు

Disease X : కరోనా వైరస్‌తో ప్రపంచ దేశాలు అతలాకుతలం అయ్యాయి.

లక్షలాది మంది మృత్యువాత పడ్డారు. పలు దేశాలు ఆర్థికంగాకూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి.

గతకొద్దికాలంగా కరోనా వైరస్ ముప్పుతగ్గుతూ వస్తోంది.

కరోనా వైరస్ తీవ్రత తగ్గిందని భావిస్తున్న తరుణంలో మంకీపాక్స్ రూపంలో మరోవైరస్ ప్రపంచ దేశాలను వణికించింది.

ముఖ్యంగా బ్రిటన్‌లో మంకీపాక్స్ వ్యాధి ఆందోళనకర స్థాయిలో వ్యాపిస్తోంది.

ఆ దేశంలో జూన్ 23 వరకు 910 మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) దీనిని ఇంకా ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా పిలవనప్పటికీ, ఇప్పటి వరకు 40 దేశాల నుండి 4000 కంటే ఎక్కువ మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి.

పలు రకాల వైరస్‌ల దాడితో వణికిపోతున్న ప్రపంచ దేశాలను రానున్న రోజుల్లో మరో వైరస్ ముప్పు పొంచిఉందని, అప్రమత్తంగా ఉండాలని బ్రిటన్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

డిసీజ్ ఎక్స్ (Disease X) కొత్త వ్యాధికారకాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని వైద్య నిపుణులు అక్కడి ప్రభుత్వానికి ఇప్పటికే సూచించారు.

బ్రిటన్‌లో మురికి నీటి నమూనాల్లో ఇటీవల పోలియో వైరస్ గుర్తించారు.

అయితే పోలియోను ఎదుర్కొనే వ్యాక్సిన్ విస్తృతంగా పంపిణీ చేసినందున పోలియో వ్యాప్తించే ప్రమాదమేమీ లేదని అక్కడి అధికారులు పేర్కొంటున్నారు.

బ్రిటన్ లో మంకీపాక్స్ కంటే ముందు క్రిమియన్ కాంగో జ్వరం కేసులు నమోదు కావడం కలవరపెట్టింది.

ఇటీవలి కాలంలో లాస్సా ఫీవర్, బర్డ్ ప్లూ వంటి కేసులు కూడా బ్రిటన్ ను వణికించాయి.

ఇలా వరుసగా అంటు వ్యాధులు వెలుగు చూస్తుండటంతో నిపుణులు ఆందోళణ వ్యక్తం చేశారు.

కానీ.. డీసీజ్ ఎక్స్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఇటీవల ప్రస్తావించింది.

డిసీజ్ ఎక్స్ అనేది ప్రస్తుతానికి ఊహాజనితమైన అంటువ్యాధి.

అది ఒక వేళ సంభవిస్తే మాత్రం ప్రపంచ వ్యాప్తంగా మరో వినాశనానికి దారితీస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ నేపథ్యంలో రెండు రకాల కరోనా వైరస్ లు, ఇంకా గుర్తించబడని డిసీజ్ ఎక్స్ తో పాటు ప్రాధాన్యత కలిగిన వ్యాధులను అంచనా వేసేందుకు పరిశోధక రోడ్ మ్యాపులు, ప్రయోగ నమూనాలను అభివృద్ధి చేశామని డబ్ల్యూహెచ్ లో గత రెండు నెలల క్రితం నివేదించింది.

మరోవైపు 1976 సంవత్సరంలో ఎబోలా ను కనుక్కోవడంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ జీన్ జాక్యూస్ ముయేంబే టామ్ ఫమ్ మాట్లాడుతూ.. మనం సరికొత్త రోగకారక జీవుల యుగంలో జీవిస్తున్నామని, డిసీజ్ ఎక్స్ కూడా అందులోని భాగమేనంటూ గతేడాది హెచ్చరించారు.

ఇటువంటి పరిణామాలు మానవాళికి ముప్పు కలిగించేవేనని ఆందోళన వ్యక్తం చేశారు.

Recent

- Advertisment -spot_img