Homeహైదరాబాద్latest Newsశ్రీరాముడి అక్షతల పంపిణీ

శ్రీరాముడి అక్షతల పంపిణీ

ఇదేనిజం, డోర్నకల్ : మండల పరిధిలోని దుబ్బతండ గ్రామంలో శుక్రవారం అయోధ్య శ్రీరాముడి అక్షతలను ఇంటింటికీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అజ్మీర భారతిబాల్య మాట్లాడుతూ ఈ నెల 22న అయోధ్యలో జరిగే శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్టా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిలో పండుగలా నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాదావత్ మోహన్, అజ్మిరా రవి, ఇస్లావత్ రవి, ఇస్లావత్ వినోద్, ఇస్లావత్ మాన్య, ఇస్లావత్ ప్రవీణ్, రాజు, సాయి, చరణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img