Homeహైదరాబాద్latest Newsఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ

ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ

ఇదేనిజం, ధర్మపురి : ఎండపల్లి మండలం అంబారిపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు ఎంపీడీవో సి. రవీందర్ రెడ్డి ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. వేసవికాలంలో కూలీలకు వడదెబ్బ, అస్వస్థతకు గురికాకుండా ప్రభుత్వం ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీకి శ్రీకారం చుట్టడం హర్షనీయమన్నారు. దీనిని కూలీలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎంపీఓ శ్రీనివాస్, గ్రామపంచాయతీ కార్యదర్శి దొమ్మాటి విజయ్ కుమార్, ఏఎన్ఎం చంద్రకళ, ఆశా వర్కర్ లు జాడి లక్ష్మి, గుమ్మడి విజయ, ఫీల్డ్ అసిస్టెంట్ సునారికారి రాజలింగయ్య( కిరణ్), ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img