Homeహైదరాబాద్latest Newsపచ్చి రొట్టె విత్తనాల పంపిణీ

పచ్చి రొట్టె విత్తనాల పంపిణీ

ఇదే నిజం, ధర్మపురి రూరల్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ధర్మపురి ఆధ్వర్యంలో పచ్చి రొట్టె విత్తనాలు అయిన జిలుగు బస్తాలను Dcms చైర్మన్ శ్రీ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి రైతులకి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూసారం పెరుగటానికి ఈ విత్తనాలు చాలా ఉపయోగపడుతాయన్నారు .అవసరమైన రైతులు భూమి పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్, ఆధార్ జిరాక్స్ పత్రాలతో సంఘ కార్యలయం లో సంప్రదించాలని పేర్కొన్నారు.
జిలుగు ఒక్కో బస్తా 30 కిలోల ధర 1116/- రూపాయలు. కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు షేర్ల రాజేశం డైరక్టర్లు పేరుమండ్ల ఎల్లాగౌడ్ , గుర్రాల పెద్ద పోచం, జజాల లక్ష్మి, వివిధ గ్రామాల రైతులు, మండల వ్యవసాయ అధికారి ముక్తేశ్వర్, pacs ceo అయ్యెరి రాజేశ్ పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img