Homeహైదరాబాద్latest Newsశ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న జిల్లా ఎస్పీ

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న జిల్లా ఎస్పీ

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ నూతనముగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా నియమితులైన అశోక్ కుమార్ ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానమునకు దర్శనమునకు వచ్చిన సందర్భంగా దేవస్థానం సాంప్రదాయం ప్రకారం మేళతాళాలతో స్వాగతం పలికిన పిదప వేదపండితులు అర్చకులు ఆశీర్వచనం ఇచ్చిన తదుపరి దేవస్థానం సూపరింటెండెంట్ కిరణ్ శ్రీ స్వామివారి శేషవస్త్రం ప్రసాదం చిత్రపటం ఇచ్చి సన్మానించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో దేవస్థానం సూపరింటెండెంట్ కిరణ్, వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ,ముత్యాల శర్మ, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ దేవయ్య, అర్చకులు అశ్విన్ కుమార్ , వంశీకృష్ణ , స్థానిక CI రామ్ నరసింహారెడ్డి , ధర్మపురి, బుగ్గారం SI లు ఉదయ్ కుమార్, శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img