Homeహైదరాబాద్latest Newsఉగాది శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ సురేష్ కుమార్

ఉగాది శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ సురేష్ కుమార్

ఇదే నిజం, కొమురం భీం ఆసిఫాబాద్ : జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఐపీఎస్ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ తెలుగు నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలను నింపాలని మనస్పూర్తిగా ఆకాంక్షించారు. ఉగాది పచ్చడిలో ఉండే షడ్రుచుల్లాగా ప్రతి ఒక్కరి జీవితంలో సుఖదుఃఖాలు ఉంటాయని ఈ ఉగాది పండుగ మనకు సూచిస్తుందని తెలిపారు. తెలుగు వారందరూ ఆరంభ పండుగగా జరుపుకునే ఈ ఉగాది నుంచి ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం వెల్లివిరియాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

Recent

- Advertisment -spot_img